COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Winter Foods: భారతదేశ వ్యాప్తంగా వింటర్ సీజన్ ప్రారంభమైంది. దీని కారణంగా వాతావరణంలో తేమ పెరిగి, చలి తీవ్రత కూడా రెట్టింపు అవుతోంది. కాబట్టి ఈ సమయంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోయి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా మంది రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల సులభంగా జలుబు, ఫ్లూ బారిన పడుతూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. 


వింటర్ సీజన్‌లో ప్రతి రోజు తీసుకునే ఆహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఈ విటర్‌ సీజన్‌లో ఎక్కువగా బయటి ఫుడ్స్‌ తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్లే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని ఆహారాలు ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. 


మెంతికూర:
శీతాకాలంలో తప్పకుండా ఆహారాల్లో మెంతికూరలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో లభించే ఫైబర్‌ పరిమాణాలు ఆకలిని నియంత్రించి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా శరీర బరువును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా శరీరాన్ని ఫిట్‌గా తయారు చేసేందుకు సహాయపడుతుంది. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


కొత్తిమీర ఆకులు:
వింటర్‌ సీజన్‌లో కొత్తిమీర ఆకులను ఆహారాల్లో తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది. దీనితో తయారు చేసిన చట్నీలను ఉదయాన్నే అల్పాహారాల్లో వినియోగిస్తే ఆరోగ్యానికి చాలా మంచింది. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు కంటి చూపును మెరుపరచడానికి కూడా సహాయపడతాయి. ముఖ్యంగా రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు శరీరంలోని పేరుపోయిన కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా కరిగిస్తుంది. 


ఆకు కూరలు:
చలికాలం రాగానే మార్కెట్‌లో ఎక్కువగా కనిపించే ఆకు కూరల్లో పాలకూర ఒకటి.  ఈ ఆకు కూరను చలి కాలంలో క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెరను తగ్గించి, ఎముకల దృఢత్వాన్ని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో పాటు క్యాన్సర్‌ను నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు శీతాకాలంలో తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook