Winter Diet: శీతాకాలంలో ఆహారపు అలవాట్లలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా ఆరోగ్యం వికటిస్తుంది. ఎప్పుడూ తినేదే అయినా మార్పులు చేర్పులు చేసుకోవల్సి వస్తుంది.  కొన్ని పదార్ధాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. మరి కొన్ని తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే చలికాలంలో జీర్ణక్రియ మందగించడం వల్ల తినే ఆహార పదార్ధాలు ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. అందుకే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి.  శీతాకాలంలో ఎలాంటి  ఆహారం తినకూడదో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కూల్ డ్రింక్స్, కూల్ వాటర్‌కు చలికాలంలో దూరంగా ఉండాలి. వివిధ రకాల వేడుకలు లేదా పార్టీల్లో కూల్ డ్రింక్స్ తీసుకోవడం సహజం. కానీ దీనివల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కన్పిస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. చలికాలంలో చల్లని నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. చల్లని నీళ్లు తాగడం వల్ల తల, గొంతు, కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. సాధ్యమైనంతవరకూ చలికాలంలో గోరు వెచ్చని నీళ్లు మాత్రమే తాగాలి. 


చలికాలంలో నూక, మైదాతో చేసే ఆహార పదార్ధాలకు దూరం పాటించాలి. ఎందుకంటే ఈ పదార్ధాలు మీ జీర్ణక్రియను బలహీనపరుస్తాయి. ఇన్ ఫ్లమేషన్ పెంచుతాయి.  అందుకే బ్రౌన్ రైస్, పప్పుల వంటి పదార్ధాలు డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి. మరీ ముఖ్యంగా రెడ్ మీట్‌కు దూరంగా ఉండాలి. ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉండటం వల్ల ఎముకలకు బలం కలుగుతుంది. కానీ చలికాలంలో జీర్ణక్రియ మందగించడం వల్ల రెడ్ మీట్ ఎక్కువైతే స్థూలకాయం, చెడు కొలెస్ట్రాల్, అదిక రక్తపోటు, గుండె వ్యాధులు రావచ్చు. చలికాలంలో శారీరక శ్రమ తగ్గడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. 


చాలామందికి ఐస్ క్రీమ్స్ అంటే ఆసక్తి ఉంటుంది. కానీ చలికాలంలో సాధ్యమైనంతవరకూ వీటికి దూరంగా ఉండాలి. శీతాకాలం సమయంలో ఐస్ క్రీమ్స్ తినడం వల్ల గొంతు, ముక్కు సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. 


Also read: Cashew Nuts: జీడిపప్పు తీసుకోవడం వల్ల ఈ మస్యలు మాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook