చలికాలంలో మార్కెట్ అంతా సహజంగానే ఆకుపచ్చని కూరగాయలతో నిండి ఉంటుంది. ఇమ్యూనిటీ క్షీణించి..దెబ్బతినే కాలంలోనే ఆరోగ్యానికి మేలు చేకూర్చే కూరగాయలు లభించడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చలికాలంలో సహజంగా రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అదే సమయంలో ఈ కాలంలో లభించే విభిన్న రకాల ఆకుపచ్చని కూరగాయల్లో ఆరోగ్యానికి కావల్సిన అన్ని పోషక పదార్ధాలు ఉంటాయి. ఆకుపచ్చని కూరగాయలు సేవించడం వల్ల వివిధ రకాల వ్యాధుల్నించి సంరక్షించుకోవచ్చు. ఆకుపచ్చని కూరగాయలు సేవించడం ద్వారా ఏయే వ్యాధుల్నించి రక్షించుకోవచ్చనేది తెలుసుకుందాం..


ఆకుపచ్చని కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ప్రయోజనకరం. పాలకూర, మెంతి కూర వంటి ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం.


తోటకూర


తోటకూర లివర్‌కు  చాలా మంచిది. తోటకూరలో విటమిన్ ఎ, విటమిన్ సితో పాటు కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తాయి. తోటకూర తినడం వల్ల బాడీ పెయిన్స్ నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.


పాలకూర


పాలకూరలో ప్రోటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ కే, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఫాస్పరస్, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. చాలా రకాల వ్యాధుల్ని దూరం చేస్తాయి. పాలకూర తినడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఎముకల్ని పటిష్టం చేస్తుంది. పాలకూర క్రమం తప్పకుండా తింటే..కేన్సర్ ముప్పు తగ్గుతుంది.


ఆవ ఆకులు


ఆవ ఆకులు ఎంత రుచిగా ఉంటాయో..ఆరోగ్యానికి అంత లాభదాయకం. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఫలితంగా చాలా వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చు. పాలకూరలో విటమిన్ బి1, బి2, బి3, బి6, సి, ఇ, కే పుష్కలంగా ఉంటాయి. ఆవ ఆకులు క్రమం తప్పకుండా తీసుకుంటే..జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెనోపాజ్ మహిళలకు ఆవ ఆకులు చాలా మంచిది. 


మెంతి కూర


మెంతికూర అనేది గుండెకు, డయాబెటిస్‌కు చాలా మంచిది. మెంతిలో ఉండే పోషక పదార్ధాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు దోహదపడతాయి. గుండె వ్యాధుల్ని దూరం చేస్తాయి. మెంతి కూరతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎముకలకు బలం లభిస్తుంది.


Also read: Health Insurance: తల్లిదండ్రులకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలను చెక్ చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook