Winter Health Tips: దీనితో వింటర్ సీజన్లో వచ్చే ఏ రోగమైన మాయం..
Winter Health Tips: తులసి డికాషన్ ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే తులసిని కొన్ని పదార్థాలతో కలిపి తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాగే ఇతర సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.
Winter Health Tips In Telugu: ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి జీవనశైలితో పాటు ఆహారాలు, వ్యాయామాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇవన్నీ పాటిస్తే శరీరం ఆరోగ్యవంతంగా శక్తివంతంగా తయారవుతుంది. ప్రస్తుతం చాలా మంది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే వీటి నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల చికిత్సలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది తరచుగా శరీరంలోని రోగనిరోధక్తి శక్తి తగ్గడం వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందడానికి తులసి ఆకులను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు వివిధ రకాల వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి.
భారత్‌లోని ప్రతి ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉంటుంది. తులసిలో ఔషధ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. ముఖ్యంగా గ్రీన్‌టీలో ప్రతి రోజు తులసి ఆకులు వేసుకుని తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ ఆకులను ఖాళీ కడుపుతో తీసుకుంటే అనేక సమస్యలు దూరమవుతాయి. అయితే తులసి ఆకులతో కొన్ని పదార్థాలు కలుపుకుని తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
తులసి, నల్ల మిరియాలు:
తులసి, నల్ల మిరియాలను కలిపి తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జలుబు, గొంతు నొప్పితో పాటు కాలానుగుణ ఫ్లూ వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే నల్ల మిరియాల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపులను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.
ఈ తులసి, నల్ల మిరియాలను క్రమం తప్పకుండా తీసుకోడం వల్ల వానా కాలంలో వచ్చే దగ్గు, శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల సులభంగా ఒంట్లో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే పొట్ట కూడా శుభ్రంగా మారుతుంది. దీనితో పాటు ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలుయ కూడా కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
తులసి ఆకులను నమిలి తినడం వల్ల ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కూడా దూరమవుతాయి. తులసి ఆకులను డికాషన్‌లా తయారు చేసుకుని కూడా తాగొచ్చు. ఇలా తాగడం వల్ల కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. దీని కోసం ముందుగా ఇక బౌల్‌లో నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. అందులోనే పౌడర్ చేసిన మిరియాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని తాగండి. అంతే సులభంగా రుచికరమైన తులసి డికాషన్ రెడీ అయినట్లే..
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.