Skin Care Tips: చలికాలంలో చర్మం నిర్జీవంగా మారిపోతుందా, ఇవి అప్లై చేస్తే చాలు చిటికెలో సమస్య మాయం
Skin Care Tips: చలికాలం నడుస్తోంది. ఈ సమయంలో సాధారణంగా చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. అయితే ప్రతి కిచెన్‌లో లభ్యమయ్యే వాటితోనే చర్మాన్ని పరిరక్షించుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం
చలికాలం వచ్చిందంటే చాలు సహజంగానే చర్మ సంబంధిత వ్యాధులు ఉత్పన్నమౌతుంటాయి. సహజంగా చలికాలంలో చర్మం నిర్జీవంగా, కాంతి విహీనంగా మారుతుంటుంది. ఈ సమస్యల్నించి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
చలికాలంలో చర్మ సంరక్షణకు చాలా రకాల క్రీమ్స్ ఉపయోగిస్తుంటాం. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ముఖం జిడ్డుగా లేదా నల్లగా మారే అవకాశముంది. అయితే ప్రతి కిచెన్‌లో లభ్యమయ్యే కొన్ని వస్తువులతో చలికాలంలో చర్మాన్ని చాలా సులభంగా ఎలాంటి దుష్పరిణామాల్లేకుండా పరిరక్షించుకోవచ్చు.
చర్మం నిగారింపు కోసం ఏం చేయాలి
పాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అదే సమయంలో పాలు చర్మ సంరక్షణకు కూడా దోహదపడుతాయి. ఎందుకంటే చలికాలంలో సాధారణంగా చర్మం నిర్జీవంగా, కాంతి విహీనంగా మారుతుంటుంది. పాలలో ఉండే ప్రోటీన్లు, మినరల్స్ చర్మానికి పోషకాల్ని అందిస్తాయి. ముఖానికి పాలు రాయడం వల్ల చర్మం నిగనిగలాడటమే కాకుండా మృదువుగా తయారౌతుంది. దీనికోసం ముఖంపై పచ్చిపాలు రాసి ఓ పది నిమిషాలుంచాలి. ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. చర్మం మృదువుగా, నిగనిగలాడుతుంది.
తేనె
చలికాలంలో చర్మం డ్రైగా మారుతుంటుంది. అందుకే చర్మంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తేనె ఉపయోగించడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. తేనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు స్వెల్లింగ్ వంటి సమస్యల్ని తొలగిస్తాయి. చర్మం ట్యానింగ్ కూడా దూరమౌతుంది.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ అనేది చర్మానికి చాలా ప్రయోజనకరం. చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. ముఖంపై ఆలివ్ ఆయిల్ రాయడం వల్ల చర్మంలో తేమ ఉంటుంది.
Also read: Health Tips: ఉదయం పరగడుపున పొరపాటున కూడా తినకూడని పదార్ధాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook