Winter Skin Tips: శీతాకాలంలో చర్మం డ్రైగా ఎందుకు మారిపోతుంటుంది, కారణాలేంటి, ఎలా రక్షించుకోవాలి
Winter Skin Tips: శీతాకాలం అంటేనే వివిధ రకాల వ్యాధులకు నిలయం. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు వేధిస్తుంటాయి. అన్నింటికంటే ప్రధానంగా వేధించేది డ్రై స్కిన్ సమస్య. ఎందుకీ పరిస్థితి, శీతాకాలంలో డ్రై స్కిన్ సమస్య ఎందుకు అధికంగా ఉంటుంది, కారణాలేంటనేది తెలుసుకుందాం.
Winter Skin Tips: శీతాకాలంలో మనిషి శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎందుకనేది కచ్చితంగా తెలియకపోయినా ఆ కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. దీనికితోడు చర్మ సంబంధిత సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి.
వేసవి కాలంతో పోలిస్తే చలికాలంలో స్కిన్ డ్రై సమస్య అధికంగా కన్పిస్తుంది. శీతాకాలంలో వాతావరణం, తేమలో మార్పు వల్ల చర్మంపై ప్రభావం పడుతుంది. చర్మం దురదగా ఉంటుంది. దాంతో చర్మం డ్రైగా మారుతుంటుంది. చాలామందికి చలికాలం వచ్చిందంటే చాలు డ్రై స్కిన్ సమస్య వేధిస్తుంటుంది. వేసవి కాలంలో స్వెట్టింగ్ కారణంగా చర్మం వెలుపలి కణజాలం సక్రమంగా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు హైడ్రేట్ అవుతుంటాయి. అదే చలికాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రత పడిపోవడం వల్ల స్వెట్టింగ్ అనేది ఉండదు. దాంతో చర్మం డ్రైగా మారుతుంటుంది. శీతాకాలం రోజదుల్లో చర్మంలో తేమ కన్పించదు. చర్మం తేమను తిరిగి పొందేలా చాలా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. డ్రై స్కిన్ లక్షణాలు, సమస్యలు ఎలా ఉంటాయి, ఎలా వీటి నుంచి విముక్తి పొందాలనే వివరాలు పరిశీలిద్దాం.
చలికాలంలో చర్మం ఎందుకు డ్రైగా మారుతుంటుంది
శీతాకాలంలో సహజంగానే ఉష్ణోగ్రత తగ్గడం వల్ల తేమలో మార్పు వస్తుంది. చర్మాన్ని డ్రై చేసే వాతావరణం ఏర్పడుతుంది. డ్రై స్కిన్‌ను సైన్స్ పరిభాషలో జెరోసిస్ అని పిలుస్తారు. చర్మం వెలుపలి భాగాన్ని ఎపిడెర్మిస్ అంటారు. ఎపిడెర్మిస్ బయటి భాగాన్ని స్ట్రామ్ కోర్నియమ్ లేదా స్కిన్ బేరియర్ అని పిలుస్తారు. విష పదార్ధాలు శరీరంలో వెళ్లకుండా స్కిన్ బేరియన్ నియంత్రిస్తుంటుంది. చలికాలంలో స్వెట్టింగ్ లేకపోవడం వల్ల స్కిన్ సెల్స్ మూసుకుపోతుంటాయి. కావల్సినన్ని పోషకాలు అందవు. దాంతో స్కిన్ బేరియర్ దెబ్బతిని డ్రైగా మారుతుంటుంది.
స్కిన్ బేరియర్‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు తేమ అనేది చాలా కీలకం. వేసవితో పోలిస్తే చలికాలంలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో చెమట కారణంగా చర్మంపై తేమ కన్పిస్తుంటుంది. కానీ శీతాకాలంలో చెమట లేకపోవడంతో తేమ ఉండదు. అందుకే వేసవిలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం సంబంధిత సమస్యలు పెద్దగా ఉండవు. చలికాలంలో మాత్రం డ్రై స్కిన్ కారణంగా చర్మ సమస్యలు పీడిస్తుంటాయి.
చలికాలంలో రూం టెంపరేటర్ పెంచేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. హీటర్లు అమర్చుకోవడం వల్ల వేడిగా ఉండేట్టు చేయడం వల్ల హ్యుమిడిటీపై ప్రభావం పడి చర్మంపై తేమ మాయమౌతుంది. బయటుండే చల్లటి వాతావరణం, చలిగాలులు, వర్షం చర్మంపై సహజసిద్ధంగా ఉండే మాయిశ్చరైజర్‌ను పోగొడతాయి. మరోవైపు చాలామంది చలి కారణంగా వేడి నీళ్లలో స్నానం చేస్తుంటారు. హార్డ్ సబ్బులు వినియోగిస్తుంటారు. దాని వల్ల చర్మంపై ఉండే సహజసిద్దమైన ఆయిల్ పోతుంది. ఫలితంగా చర్మం డ్రైగా మారుతుంటుంది.
చలికాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి
చర్మాన్ని ఎప్పటికప్పుడు హైడ్రేట్‌గా ఉంచాలి. దీనికోసం రోజుకు తగిన మోతాదులో నీళ్లు తాగడం మానకూడదు. స్నానం వేడి వేడి నీళ్లతో చేయకూడదు. గోరువెచ్చని నీళ్లతోనే స్నానం చేయాలి. చలిలో బయటకు వెళ్లేటప్పుడు చర్మాన్ని కప్పుకోవాలి. అంటే చలిగాలులకు ఎక్స్‌పోజ్ కాకుండా చూసుకోవాలి. సువాసనలు వెదజల్లే సబ్బు, డియోడరెంట్ వాడకం తగ్గించాలి. వీటివల్ల చర్మానికి హాని కలుగుతుంది.
Also read: Winter Hair Fall: శీతాకాలంలో జుట్టు ఎందుకు ఎక్కువగా రాలుతుంటుంది, పాటించాల్సిన చిట్కాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook