Wood Apple Health Benefits in Summer: వెలగపండును బిల్వ పండు అని కూడా పిలుస్తారు. ఇది సమ్మర్లో ప్రత్యేకమైన పండు. బయట వైపు కాస్త మందంగా గట్టిగా ఉండి లోపల తీపి, పులుపు కలిపిన రుచి కలిగి ఉంటుంది.ఈ వెలగపండు లో అనేక పోషకాలు విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. ఈ ఎండాకాలం ప్రత్యేకంగా జీర్ణ ఆరోగ్యానికి ఎంతో కావాల్సిన పోషకాలు ఇందులో ఉన్నాయి. కొబ్బరినీళ్లు మన డైట్లో చేర్చుకున్నట్లే ఈ పండు జ్యూస్‌ ను కూడా చేర్చుకోవచ్చు. ఈ పండుతో మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోషకాలు గని..
వెలగపండులో మన శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అలాగే  ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపునకు మంచిది అంతే కాదు ఇందులో పొటాషియం అంటే ఖనిజాలు కూడా ఉన్నాయి వెలగపండు లో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది  ఇది ఎముక ఆరోగ్యానికి సహాయపడుతుంది.


జీర్ణ ఆరోగ్యం..
వెలగ పండు లో ఉండే మరో ఆరోగ్య ప్రయోజనం ఏంటంటే ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వెలగపండును మన డైట్ లో చేర్చుకోవడం వల్ల పేగు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్యలకు చెక్ పెడుతుంది.


మలబద్ధకం..
వెలగ పండులో మలబద్ధకం సమస్యను తగ్గించే గుణాలు ఉన్నాయి ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం, ముఖ్యంగా కరిగే ఫైబర్ ఉండటం వల్ల మలబద్దకానికి చెక్ పెడుతుంది. ఇందులో ఉండే ట్యానిన్స్ మలబద్ధకం  పేగు ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది.


గుండె ఆరోగ్యం..
వెలగ పండులో పొటాషియం ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది పొటాషియం బీపీ లెవెల్ నియంత్రిస్తుంది బీపీ లెవెల్స్ పెరగకుండా ఆరోగ్యానికి సహాయపడుతుంది.


ఇమ్యూనిటీ బూస్ట్..
విటమిన్ సి ఉంటుంది ఇది ఇమ్యూనిటీ బూస్ట్ చేసే గుణాలు కలిగి ఉంటుంది విటమిన్ సి మన ఇమ్యూన్ సిస్టం పని తీరుకు సహాయపడుతుంది. అంతేకాదు ఇది తెల్లరక్త కణాలను ఉత్పత్తి పెంచుతుంది. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి.


ఇదీ చదవండి:  మామిడిపండ్లను తినబోయే ముందు నీళ్లలో ఎందుకు  నానబెట్టాలి?


బరువు నిర్వహణ..
వెలగపండు డైట్లో చేర్చుకుంటూ బరువు కూడా ఈ సులభంగా తగ్గొచ్చు. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అతిగా తీనాలనే కోరిక అనిపించదు కడుపు నిండుగా ఉంటుంది.


చర్మ ఆరోగ్యం..
వెలగపండుల యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ కంటెంట్ కూడా అధికంగా ఉండటం వల్ల ఇది ఫ్రీ రాడికల్ సమస్య నుంచి కాపాడుతుంది త్వరగా  ముఖంపై వృద్ధాప్య ఛాయలు రావు ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల అది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )


ఇదీ చదవండి: పుచ్చకాయతొక్కతో ఇలా బరువు తగ్గండి.. బీపీకి కూడా చెక్..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి