World Coconut Day 2021: కొబ్బరితో కోటి లాభాలు..! ఆ ప్రయోజనలేంటో తెలుసుకుందామా..!
World Coconut Day: ప్రతీ ఏటా సెప్టెంబరు 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...
World Coconut Day: మనిషి ఆరోగ్యానికి అవసరమైనవి ఎన్నో ప్రకృతి అందిస్తోంది. అలా ప్రకృతి ఇచ్చిన వాటిలో కొబ్బరి ఒకటి. కొబ్బరి ఆవశ్యకతను, దాని వల్ల కలిగే ప్రయోజనాలపై అందరికీ అవగాహన కలిగించేందుకు ప్రతీ ఏటా సెప్టెంబరు 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం(World Coconut Day) జరుపుతారు. ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని తొలిసారిగా 2009 సంవత్సరంలో జరిపారు.
World Coconut Day 2021: Theme
"Building a Safe Inclusive Resilient and Sustainable Coconut Community Amid COVID-19 Pandemic & Beyond".
డయాబెటిస్ కు చెక్..
కొబ్బరి బోండాతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. గుండెను ఈ కొబ్బరి నీళ్లు పదిలంగా వుంచుతాయి. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. డయాబెటిస్(Diabetes) వున్నవారు కొబ్బరి నీళ్లు(Coconut Water) సేవిస్తే ఎంతో మంచిది. ఈ నీళ్లు ఎన్ని తాగినా శరీరంలో కొవ్వు(Fat) పెద్దగా ఏర్పడదు. అందుకే అంటారు ఒక కొబ్బరిబోండాం.. ఒక సెలైన్ బాటిల్‌తో సమానం అని. రెండో ప్రపంచ యుద్ధంలో సెలైన్ కొరత రావడంతో.. గాయపడిన వారికి కొబ్బరి బోండాలనే ఇచ్చారు. అండమాన్ నికోబార్ దీవుల్లో(Andaman nicobar islands) వందేళ్ల కిందటి వరకూ డబ్బు బదులు కొబ్బరి బోండాలు ఇచ్చుకునేవాళ్లు. మాల్దీవుల(Maldives) జాతీయ వృక్షం కొబ్బరి చెట్టు. కొబ్బరి శాస్త్రీయ నామం 'కోకాస్ న్యూసిఫెరా' (Cocos nucifera).
Also Read: Viper Poison: కరోనాకు మందు..ఆ ప్రమాదకర పాము విషమే
కొబ్బరి ఉపయోగాలు
* పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు(Cholesterol levels) తగ్గుతాయి. పచ్చికొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి.
* కొబ్బరిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు రోగ నిరోధక శక్తి (Immunity)పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా గొంతు, బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి.
* కొబ్బరిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే అల్జీమర్స్(Alzheimers) వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ కొబ్బరి కీలకపాత్ర పోషిస్తుంది.
* కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇక కొబ్బరిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. పేగుల్లో కదలికలు బాగుంటాయి. దీంతో మలబద్దకం సమస్య నుంచి బయటపడొచ్చు. అంతేకాకుండా పైల్స్(Piles) వంటి సమస్యలతో బాధపడుతోన్న వారికి ఉపశమనం లభిస్తుంది.
* పొడి చర్మం, వెంట్రుకలు చిట్లడం వంటి సమస్యలతో బాధపడుతోన్నవారికి కొబ్బరి దివ్యౌషధంగా పనిచేస్తుంది. చర్మంలో తేమను పెంచడంలో కూడా కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. కొబ్బరిలో ఉండే మోనోలారిన్, లారిక్ యాసిడ్‌లు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు తగ్గుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook