Worst Foods: ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మీ జ్ఞాపకశక్తి తగ్గుతుంది!
Worst Foods for brain: మనం కొన్ని చెడు ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడుని పనితీరుపై చెడు ప్రభావం పడుతుంది అనే విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Worst Foods For Brain: మెదడు పనితీరు సరిగ్గా జరగాలి అంటే మంచి పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలిని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే మనంలో చాలా మంది కొన్ని చెడు ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల మెదడు పనితీరుపై దుష్ప్రభావాలు కలుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల మెదడుపై చెడు ప్రభావం కలుగుతుంది..
చక్కెర, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ సమస్యతో పాటు బ్రెయిన్ పైన ప్రతికూలమైన ఫలితాలనిస్తాయని పరిశోధనలో కనుగొన్నారు. మీరు తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్లలో చక్కెర, మైదాపిండి అధికశాతం ఉండడం వల్ల మెదడు ఆరోగ్యానికి మంచిది కాదని తెలుస్తోంది.
దీనికి బదులుగా ఒమేగా -3 కలిగిన ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చిప్స్, స్వీట్లు, ఇన్‌స్టెంట్ నూడుల్స్, రెడీమేడ్ పదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతారని నిపుణులు చెబుతున్నారు.
మెదడు పనితీరు మెరుగు ఉండాలి అంటే పచ్చి ఆకుకూరలు, పండ్లు, మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. దీని వల్ల మెదడు, శరీరం ఎంతో అరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు మీ ఆహారంలో పోషాకాలు లభించే పదార్థాలు తీసుకోవడం వల్ల ఎలాంటి చెడు ప్రభవాల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Poco M6 5G Price: న్యూ ఇయర్ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook