Weight Loss Tips: ఈ ఆహార పదార్థాలను రోజూ తీసుకుంటే..కేవలం 14 రోజుల్లో ఆరోగ్యంగా బరువు తగ్గుతారు..
Yellow Foods For Weight Loss: అనారోగ్యకరమైన ఫుడ్స్ ను క్రమంగా తీసుకోవడం వల్ల సులభంగా బరువు పెరుగుతున్నారు. అయితే బరువును తగ్గించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. సులభంగా బరువు తగ్గడానికి ఈ చిట్కాలు పాటించండి.
Yellow Foods For Weight Loss: అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకొని ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల సులభంగా బరువు పెరుగుతున్నారు. ఇలా బరువు పెరగడం ఓ సాధారణ సమస్యగా మారింది. అయితే చాలామంది ఎలాంటి ఆహారాలను తీసుకోకపోవడం వల్ల ఇదే గ్రామంలో బరువు కూడా తగ్గుతున్నారు. బరువు తగ్గడానికి బరువు పెరగడానికి పోషకాహారం చాలా మంచిది. కాబట్టి పోషకాహారాన్ని తీసుకుంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. బరువు పెరిగే వారిలో చాలామంది బరువు తగ్గడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ తగ్గలేక పోతారు. ఇలాంటి వారి కోసం ఆరోగ్య నిపుణులు పలు రకాల ఆహార చిట్కాలను సూచిస్తున్నారు. ఈ చిట్కాలను పాటించడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యకరమైన శరీరాన్ని కూడా పొందవచ్చు.
బరువు తగ్గడానికి సులభమైన చిట్కాలు ఇవే:
నిమ్మకాయ:
నిమ్మకాయ శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి జీర్ణ క్రియ సమస్యలను దూరం చేసి శరీరంలో టాక్సిన్ ను తొలగిస్తాయి. ఈ ప్రక్రియ ద్వారా సులభంగా బరువు తగ్గుతారు.
అల్లం:
అల్లంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఎల్లో క్యాప్సికమ్:
అందరూ తరచుగా గ్రీన్ క్యాప్సికమ్ లు వినియోగిస్తారు. ఇందులో కేలరీల పరిమాణం అధికంగా ఉంటుంది. అయితే వీటికి బదులుగా ఎల్లో క్యాప్సికంలు తీసుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో జీర్ణ క్రియను మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వీటిని ఆహారంలో చేర్చుకోవాలి.
అరటి పండ్లు:
శరీరానికి అరటి పండ్లు చాలా మంచివి. ఇందులో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా అల్పాహారంలో భాగంగా తీసుకుంటే.. శరీరం దృఢంగా మారడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ పరిమాణం బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు డైట్ లో భాగంగా అరటిపండ్లను తీసుకోండి.
Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు
Also read: Indian Airforce Day: ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ డేను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook