Home Remedies To Whiten And Brighten Teeth: మీరు పళ్లు ఎలా తోముతున్నా పసుపు రంగుగా మారుతున్నాయా.. మీ నోటి నుంచి దుర్వాసన వస్తుందా మీ సమస్యకు ఇక్కడ పరిష్కారం అందిస్తున్నాం. మీ దంతాలు పసుపు రంగులోకి మారడానికి కొన్ని కారణాలున్నాయి. అందుకు మీరు తీసుకునే ఆహారం కూడా ఒక కారణం అవుతుంది. కొన్నిసార్లు దంతాలకు సరైన పోషణ లేకపోవడం, స్మోకింగ్, వయసురీత్యా కారణాలు, వాతావరణం లాంటి పలు అంశాల కారణంగా మీ దంతాలు తెలుపు నుంచి పసుపు రంగులోకి మారతాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీ దంతాలు తెలుపుగా చేసుకునేందుకు ఈ Home Remedies పాటించండి
ఆయిల్ పుల్లింగ్(Oil Pulling)
కొబ్బరి నూనెతో సమస్యకు చెక్ పెట్టవచ్చు. కొబ్బరి నూనెతో పలు సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు టేబుల్ స్పూన్ మోతాదులో కొబ్బరి నూనె నోట్లో పోసుకుని పుకిలించాలి. అలా ఓ 10 నిమిషాలు చేసిన తరువాత ఆ నూనెను ఉమ్మివేయాలి. ఆ తరువాత కొన్ని మంచి నీళ్లు నోట్లో పోసుకుని పుకిలించాలి. అనంతరం బ్రష్ చేసుకోవాలి.


Also Read: Health tips: పర కడుపున ఈ పదార్ధాలు అస్సలు తీసుకోకండి


బేకింగ్ సోడా (Baking Soda)
దంతాలను తెల్లగా మార్చే గుణం బేకింగ్ సోడా కలిగి ఉంటుంది. దీన్ని కొన్ని రకాల టూత్ పేస్టులలో సైతం వాడతారు. కొత బేకింగ్ పోడాను కొన్ని చుక్కల నీళ్లలో పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పేస్టుగా మార్చి బ్రష్ చేసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండు పర్యాయాలు ఇలా చేస్తే మీ దంతాలు పసుపు రంగు నుంచి తెలుపు రంగులోకి మారతాయి.


యాపిల్ సైడర్ వెనిగర్ (Apple Cider Vinegar)
వాస్తవానికి యాపిల్ సైడర్ వెనిగర్ దంతాలు సహా మన శరీరంలోని పలు అవయవాలకు మేలు చేస్తుంది. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని కొన్ని నీళ్లల్లో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని పుకిలించి ఉమ్మివేయాలి. రోజూ బ్రష్ చేసే ముందు ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది.


Also Read: Benefits of Drinking Milk: పాలు తాగితే మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సహా పలు సమస్యలు దూరం అవుతాయి


పండ్ల తొక్కలు (Fruit Peels)
అరటి పండు(Health Benefits of Banana), బత్తాయి, సంత్రం పండ్లు, నిమ్మకాయ తొక్కలలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. అది మీ దంతాలను తెలుపు రంగులోకి తీసుకువస్తుంది. ప్రతిరోజూ బ్రష్ చేసే ముందు అరటి పండు లేదా బత్తాయి లేదా నిమ్మకాయ తొక్కలతో దంతాలను రుద్దాలి. ఆ తరువాత బ్రష్ చేస్తే దంతాలు తెలుపు రంగులోకి మారతాయి.


బొగ్గు పొడి (Activated Charcoal)
బొగ్గు ద్వారా దంతాలకు మేలు జరుగుతుంది. దంతాలను తళతళ మెరిసేలా చేయడంతో పాటు నోటిలోని విషపూరితాలను, బ్యాక్టీరియాలను తరిమికొడుతుంది. కొంత బొగ్గును తీసుకుని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిని టూత్ బ్రష్‌తో గానీ లేదా చేతి వేలితో పళ్లు తోముకోవాలి. దాని వల్ల మీ దంతాలు తళతళలాడతాయి. కొన్ని రకాల బ్యాక్టీరియాలు, విషపూరితాలను తొలగిస్తుంది. 


Also Read: Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే  


గమనిక: మీరు ఇలాంటివి ఏవి పాటించాలన్నా కూడా ముందుగా వైద్యుడ్ని సంప్రదించాలి. వారి సలహా మేరకు మీరు ఆరోగ్య చిట్కాలు పాటిస్తే ఏ ఇబ్బంది ఉండదు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook