`యోగా` తో డీఎన్ఏ రివర్స్
యోగా, ధ్యానం వల్ల డిఎన్ఏ లో మార్పులు జరుగుతాయట. ఈ విషయాన్ని 11 ఏళ్లపాటు పరిశోధన జరిపిన అనంతరం కోవెంట్రీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. యోగా, ధ్యానంతో డీఎన్ఏ మార్పులకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు. వీటివల్ల శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు యోగా, ధ్యానం లాంటివి చేస్తే ఒత్తిడి, డిప్రెషన్ దూరమవుతుందని తెలుసు. కానీ డీఎన్ఏ కూడా మార్పులకు లోనవుతుందని ఇప్పడే తెలిసింది.
డీఎన్ఏ లో వచ్చే మార్పులు, సంభవించే ప్రతిస్పందనల వల్ల ఒత్తిడి, డిప్రెషన్ లోనవుతామని కోవెంట్రీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. డీఎన్ఏ ప్రతిస్పందనను రివర్స్ చేసేందుకు యోగా, మెడిటేషన్ ఉపయోగపడుతాయన్నారు. ఈ విషయం చెప్పడానికి ఆ శాస్తవేత్తలు బృందం 18 పరిశోధనలు చేశారు. అలా చేసిన తరువాత వచ్చిన ఫలితాలను విశ్లేషించి ఈ నిజం కనుగొన్నాం అన్నారు. ఈ పరిశోధనకు 846 మంది వాలంటీర్లపై 11 ఏళ్లపాటు పరిశోధన జరిపినట్లు వర్శిటీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.