COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Yoga For Belly Fat: స్థూలకాయం కారణంగా చాలా మందిలో శరీర సమస్యలే కాకుండా మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి చిన్న తనంలోనే అధిక బరువు సమస్యలతో బాధపడేవారు సకాలంలో నియంత్రించుకోవడం చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే మానసిక సమస్యలతో పాటు శరీర బరువు పెరిగి గుండెపోటు, అధిక రక్తపోటు సమస్యలు కారణంగా ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. స్థూలకాయం కారణంగా చాలా మందిలో బెల్లీ ఫ్యాట్ సమస్యలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమస్యల కారణంగా శరీర ఆకృతి కోల్పోతున్నారు. అయితే మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే ఈ కింది యోగాసనాలు ప్రతి రోజు వేయాల్సి ఉంటుంది. 


ఈ ఆసనాలతో బెల్లీ ఫ్యాట్ కరగడం ఖాయం!
పాద హస్తాసనం(Pada Hastasana)

పాదహస్తాసనం  ప్రతి రోజు వేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఆసనాన్ని వేయాలనుకునేవారు ముందుగా నిటారుగా నిలబడి..తుంటి నుంచి చేతి వేళ్ళతో  పాదాలను తాకాల్సి ఉంటుంది. ఇలా కొన్ని సెకండ్ల పాటు ఉండి..ఆ తర్వాత శరీరానికి విశ్రాంతిని ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజు చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్‌ కూడా సులభంగా కరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 


Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  


త్రికోణాసనం(Trikonasana)
ప్రతి రోజు త్రికోణాసనం వేయడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేదయ నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ఆసనాన్ని వేయడానికి ముందుగా రెండు కాళ్లను బాగా చాపాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిలబడి రెండు చేతులను కూడా పొడవుగా చాపాలి. ఇలా చేసిన తర్వాత మీ ఎడమ చేతిని, నడుమును నెమ్మదిగా వంచుతూ నేలను ముట్టాల్సి ఉంటుంది. ఇలా 3 సెకండ్ల పాటు ఉండి..ఆ తర్వాత నిలబడాల్సి ఉంటుంది. ఇలా రోజుకు 5 నుంచి 6 సార్లు చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్‌ను సులభంగా కరిగించుకోవచ్చు. అంతేకాకుండా పొట్ట భాగం కూడా దృఢంగా మారుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 


Also Read: Pakistan Bad Fielding Video: యు ఫన్నీ.. సింపుల్ రనౌట్ మిస్ చేసిన పాక్ ఫీల్డర్లు.. ఇలా ఉన్నారంటేరయ్యా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి