Yogurt Side Effects: పాలల్లో అనేక పోషకాలు ఉంటాయని అందరికి తెలిసిన విషయమే! కానీ, పాల పదార్థమైన పెరుగు వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందట. అయితే ఆ సమస్యలు ఏమిటి? ఏఏ అనారోగ్య సమస్యలతో బాధపడే వారు పెరుగు అతిగా తినకూడదో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెరుగు ఎలా తినాలి?


కొన్ని సార్లు పాలు తాగిన కొద్దిసేపటికే కొందరు పెరుగు తింటారు. అలా తినడం వల్ల పాలతో పెరుగు కలిసి పోయి జీర్ణక్రియను స్తంభింపజేస్తాయి. దీంతో గుండెల్లో మంట, పుల్లని త్రేనుపులు, నోటిపూత వంటి సమస్యలకు గురికావొచ్చు. బాగా గడ్డకట్టిన పెరుగును తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగును మట్టికుండలో గడ్డ కట్టిస్తే మరింత మేలు జరుగుతుంది. పెరుగు తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 


పెరుగును ఎలా తినకూడదు?


పెరుగును శాస్త్రీయ పద్ధతుల ద్వారానే గడ్డకట్టించం చేయాలి. అదే విధంగా అందులో ఆవాల నూనె, ఉప్పుతో కలిపి తినడం మానుకోవాలి. ఎందుకంటే అవి ఆరోగ్యానికి కీడు చేస్తాయి. అదే విధంగా బరువు పెరగాలనుకునే వారు పెరుగులో ఉడకబెట్టిన పచ్చి బఠాణీలు, జామకాయల బాత్ తో కలిపి తినవచ్చు. గడ్డకట్టిన పెరుగుతో చేసిన మజ్జిగ తాగడం వల్ల గొంతు నొప్పి, కడుపులో వికారం, జ్వరం, అలసట, తల తిరగడం వంటి సమస్యలు తగ్గుతాయి. 


శరీరంలో వేడిని తగ్గిస్తుంది.. 


పెరుగును బాగా చిలకరించగా వచ్చిన మజ్జిగలో పంచదార, యాలుకలు, లవంగాలు, కుంకుమ పువ్వు, పచ్చి మిర్చి వేయాలి. వాటన్నింటిని మజ్జిగలో కలిపి తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది. అలాగే ఆకలి లేని వారు పులుపు ఉన్న పెరుగును తింటే ఇట్టే ఆకలి వేస్తుంది. 


పెరుగు ఎవరు తినకూడదు?


మెత్తగా పులిసిపోయిన పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉదర వ్యాధులు ఉన్న వారు రాత్రి పూట పెరుగు తినకపోవడం మంచిది. అలాంటి వారు రాత్రిపూట పెరుగు తింటే అజీర్ణం, ఊపిరి ఆడకపోవడం, రక్తహీనత, కామెర్లు, చర్మవ్యాధులు, రక్తస్రావము వంటి సమస్యలు వస్తాయి. అయినా పెరుగు తినాలనిపించిన క్రమంలో పెరుగులో కొద్దిగా తేనె కలిపితే సరి. లేదంటే పెరుగులో జీలకర్ర, ఇంగువ, నేరుడు పండ్లను కలిపి తినవచ్చు.  


Also Read: Anti Ageing Juice: ఈ పండ్ల రసాలు తాగడం వల్ల ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు!


Also Read: Black Grapes Benefits: నల్ల ద్రాక్ష తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.