Raw Milk Side Effects: మంచి ఆరోగ్యం కోసం పాలను (Milk) తీసుకోవాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. పాలను రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు. కొంత మంది నేరుగా తాగుతారు, మరికొంత మంది పాల ఉత్పత్తులను తినడం ద్వారా ఈ సూపర్ పుడ్ ప్రయోజనాన్ని పొందుతారు. అయితే పాలు పచ్చిగా తాగాలా లేదా మరగించాలా? అనే దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పచ్చి పాలు తాగితే ఏమవుతుంది?
పచ్చి పాలు (Raw Milk) తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందనేది నిజం. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికాస్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకారం, పచ్చి పాలలో ఎస్చెరిచియా కోలా (ఇ. కోలి) మరియు లిస్టేరియా, సాల్మోనెల్లా మొదలైన అనేక హానికరమైన బ్యాక్టీరియా ఉండవచ్చు. ఎవరైనా పచ్చి పాలు తాగితే ఫుడ్ పాయిజినింగ్ అవుతుంది.


Also Read: Egg Side Effects: గుడ్డు తిన్న వెంటనే ఈ 4 ఆహార పదార్థాలు అసలు తినొద్దు! 


దుష్ప్రభావాలు
పచ్చి పాలలో ఉండే బ్యాక్టీరియా మన శరీరానికి విరేచనాలు, కీళ్లనొప్పులు మరియు డీహైడ్రేషన్ వంటి సమస్యలను కలిగిస్తుంది.


పచ్చి పాలలో మురికి ఉండవచ్చు
పచ్చి పాలు తాగడం కూడా హానికరం. ఎందుకంటే పశువుల పాలను తీసినప్పుడు పొదుగు కలుషితమవుతుంది, అంతే కాకుండా శుభ్రమైన చేతులు దీనికి ఉపయోగించకపోతే, పాలలో మురికి వస్తుంది. అందుకే మనం పాలు మరిగించిన తర్వాత తాగడం అవసరం, తద్వారా బ్యాక్టీరియా చనిపోతుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook