Hyderabad Lok Sabha Election 2024: దేశ వ్యాప్తంగా తెలంగాణలోని హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై అందిరి దృష్టి కేంద్రీకృతమైంది. తన ప్రచారంతో హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్‌కు చుక్కులు చూపిస్తోంది. దీంతో ఎన్నడు హిందూ దేవాలయాలవైపు కన్నెత్తి చూడని అసుదుద్దీన్‌కు గుడి మెట్లు ఎక్కేలా చేయడంలో సక్సెస్ అయింది. అంతేకాదు ప్రచారంతో దూసుకుపోతుంది. అంతేకాదు దేశ వ్యాప్తంగా తెలంగాణలో ఏ ఎంపీ క్యాండిడేట్‌కు రానీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలోని కంటోన్మెంట్ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకొని తను పోటీ చేస్తోన్న హైదరాబాద్‌ పార్లమెంట్ స్థానంలో పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించింది. అక్కడ ఓటు వేస్తోన్న బురఖాలో ఉన్న ముస్లిమ్ మహిళలను తనిఖీలు నిర్వహించి సంచలనం రేపింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక హైదరాబాద్ పార్లమెంట్ సీటు పై రాజాసింగ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే బీజేపీ అధిష్ఠానం మాధ‌విల‌త‌ను దించ‌డం వెన‌క పెద్ద గ్రౌండ్ వ‌ర్క్ చేసింది. ఆమె అప్ప‌టికే త‌న పార్లమెంట్ పరిధిలో  ఎన్నో కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల్లో దూసుకెళ్లింది. మొత్తంగా మాధవిలతా  ఓవైసీకి కోట‌కు బీట‌లు వారేలా చేస్తుందా లేదా అనేది చూడాలి. అంతేకాదు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలిచినా.. త‌క్కువ మార్జిన్‌తో ట‌ఫ్ ఫైట్‌తో బ‌య‌ట‌ప‌డ‌తార‌నేది రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న మాట‌.


Also read: 4th Phase Lok Sabha Polls 2024 : దేశ వ్యాప్తంగా నాల్గో దశలో ఎలక్షన్ పోలింగ్ జరిగేది ఈ లోక్ సభ సీట్లలోనే.. !



ముఖ్యంగా ఎన్నికల బరిలో దిగిన తర్వాత హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 15 అసెంబ్లీ సీట్ల పరిధిలో  దాదాపు 5 లక్షల బోగస్ ఓట్లు తొలిగించారు. ఇలా తొలిగించిన ఓట్లలో అత్యధిక శాతం మజ్లిస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉండటంతో హైదరాబాద్‌లో ఎన్నికల ఫలితాలను తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదని మజ్లిస్ పార్టీ నేతల్లో కలకలం రేపుతోంది. హైద‌రాబాద్ ప‌రిధిలో దాదాపు 1.5 ల‌క్ష‌ల 40 వేల దొంగ ఓట్ల‌ను తొలిగించ‌డం అనేది ఓ రికార్డు అనే చెప్పాలి. త‌న పార్ల‌మెంట్ ప‌రిధిలో ఇన్ని ల‌క్ష‌ల బోగ‌స్ ఓట్ల‌ను తొలిగించినా ఓవైసీ కిక్కురుమ‌న‌కుండా ఉండ‌టం వెన‌క ఆయ‌న పరాజయా భ‌యాన్ని సూచిస్తోంది. మ‌రోవైపు మాధ‌వి ల‌త ప్ర‌చారానికి ఊహించిన రేంజ్‌లో పాత‌బ‌స్తీ లాల్ ద‌ర్వాజా, సుధా టాకీస్ ప్రాంతాల్లో రెస్పాన్స్ రావ‌డం ఆమె గెలుపుకు మంచి బూస్ట్ ఇచ్చిందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.


ముఖ్యంగా పాత‌బ‌స్తీలో ఎక్కువ మంది చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారాలు.. మాధ‌వి ల‌త ప్ర‌సంగాలు విన‌డానికి ఉద్యోగాల‌కు సెల‌వులు పెట్టి మ‌రి వ‌చ్చిన దాఖలాలున్నాయి. ఇది వంద శాతం నిజం. మొత్తంగా ఓవైసీని భ‌య‌పెట్టే సివంగి వ‌చ్చింద‌ని అంద‌రు చెప్పుకుంటున్నారు. మొత్తంగా హైద‌రాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఉత్త‌ర ప్ర‌దేశ్ త‌ర‌హా పోల్ మేనేజ్‌మెంట్ జ‌రిగేలా  బీజేపీ పోలింగ్ బూత్ వైజ్ చ‌ర్య‌లు తీసుకుంది. తాజాగా ఈ ఎన్నికల్లో పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించినట్టు ఆమె బురఖాలో ఉన్న మహిళలను తనిఖీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.