Hyderabad Fire Accident: హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుడిమల్కాపూర్‌లోని అంకుర ఆసుపత్రిలో శనివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆసుపత్రిలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసుపత్రిలోని రోగులు, సిబ్బందిని బయటకు తీసుకు వచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు అంతస్తుల్లో ఉన్న ఈ భవనం మెుత్తం మంటలు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


ఆరు ఆంతస్తులో చెలరేగిన మంటలు మెుదటి అంతస్తు వరకు వ్యాపించాయి. చివరి అంతస్తులో ఆస్పత్రిలో పనిచేసే నర్సులు హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంటలు ఎగసిపడటంతో దాదాపు వంద మంది నర్సులు ప్రాణభయంతో కిందకు వచ్చేశారు. అయితే హాస్టల్ లో సర్టిఫికెట్లు వదిలేసి వచ్చినట్లు చెప్పారు. అవి కాలిపోతాయనే భయంతో వారు బోరున విలపించారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఎంత మంది రోగులు ఉన్నారనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అంకుర ఆసుపత్రి చుట్టూ దట్టమైన పొగ అలముకొని ఉండటంతో అందరూ భయాందోళన చెందుతున్నారు. 
 


Also read: School Holidays: స్కూళ్లకు రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook