శ్రీనగర్: ఉగ్రదాడిలో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
శ్రీనగర్‌లోని కరణ్ నగర్‌లో సీఆర్పీఎఫ్ కు, ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న భీకర కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ప్రాణాలు విడిచాడు.
శ్రీనగర్‌లోని కరణ్ నగర్‌లో సీఆర్పీఎఫ్ కు, ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న భీకర కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ప్రాణాలు విడిచాడు.
సోమవారం ఉదయం 4:30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఏకే- 47తుపాకీలతో సీఆర్పీఎఫ్ 23వ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ లోకి ప్రవేశించాలని రాగా.. అడ్డుకొనేందుకు జవాన్లు కాల్పులు జరిపారు.
'ఉగ్రవాదులు ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించలేకపోయినా, హెడ్ క్వార్టర్స్ కి సమీపంలో ఉన్న భవనంలో దొంగతనంగా చొరబడ్డారు. ఐదు కుటుంబాలు ఖాళీ చేయించాము. ఆపరేషన్ కొనసాగుతోంది" అని సీఆర్పీఎఫ్ ఐజీ రవిదీప్ సహాయ్ చెప్పారు.
'ప్రస్తుతం, ఐదుగురు కుటుంబాలను క్యాంప్ చుట్టూ ఉన్న ఇళ్ళ నుండి ఖాళీ చేయించాము. ఆపరేషన్ జరుగుతోంది' అని అధికారిని నిర్ధారించారు.
శనివారం జమ్మూలోని సంజ్వాన్ సైనిక శిబిరంలో తీవ్రవాదులు చొరబడి ఐదుగురు భద్రతా సిబ్బందిని, ఒక పౌరుడిని హతమార్చారు. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు, ఆరుగురు పౌరులు గాయపడ్డారు. భారత భద్రతా దళాలు నలుగురు తీవ్రవాదుల్ని మట్టుబెట్టాయి. సంజ్వాన్ ఆర్మీ క్యాంప్ లో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా జరుగుతున్నాయి.