Maoists Attack: ఛత్తీస్‌గఢ్ లో దారుణం.. పోలీసుల వాహనం లక్ష్యంగా మావోయిస్టుల పేలుడు, 10 మంది మృతి
నేడు ఉదయం ఛత్తీస్‌గఢ్ లో బస్తర్ జిల్లాలో మావోయిస్టులు పోలీసుల వాహనం లక్ష్యంగా చేసుకుని పేలుడుకు పాల్పడటంతో ఏకంగా 10 మంది పోలీసులు మరియు వాహనం డ్రైవర్ ప్రాణాలను కోల్పోవడం జరిగింది.
Maoists Attack: ఒకప్పుడు సౌత్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మావోయిస్టుల కదలికలు ఉండేవి. కానీ ఈమధ్య కాలంలో మావోయిస్టుల కదలికలు లేవు.. ఎన్ కౌంటర్స్ లేవు.. కూబింగ్ లేవు అనుకుంటూ ఉండగా అనూహ్యంగా ఎక్కడో ఒక చోట మావోయిస్టుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు లేదా మావోయిస్టులు మృతి చెందుతూనే ఉన్నారు. నేడు ఉదయం ఛత్తీస్‌గఢ్ లో బస్తర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల వాహనం లక్ష్యంగా చేసుకుని పేలుడుకు పాల్పడటంతో ఏకంగా 10 మంది పోలీసులు మరియు వాహనం డ్రైవర్ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఈ దాడిని రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా ఖండించారు.
బస్తర్ జిల్లాలో దంతేవాడలో మావోయిస్టులు ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో ఉదయం డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ ప్రత్యేక యాంటీ నక్సలైట్ టీమ్ ఆపరేషన్ చేపట్టారు. ఆ ఆపరేషన్ ను ముగించుకుని పోలీసులు తిరిగి ప్రయాణం అయిన సమయంలో మావోయిస్టులు ముందే ప్లాన్ చేసిన ప్రకారం ఐఈడీ తో దాడి చేసి పోలీసులు ప్రయాణిస్తున్న కారుని పేల్చేశారు. వ్యాన్ డ్రైవర్ సహా మరో పది మంది పోలీసులు అక్కడికి అక్కడే మృతి చెందినట్లుగా అధికారులు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున పోలీసులు క్షతగాత్రులుగా మిగిలారు. 11 గా ఉన్న మృతుల సంఖ్య ఒకటి రెండు రోజుల వరకు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు. గాయ పడ్డ వారిలో కొందరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వారిని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఈ సంఘటన నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ ఐపీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. కొన్ని రోజుల క్రితం పోలీసులు మరియు ఇతర భద్రతా బలగాలపై దాడులు చేయబోతున్నట్లుగా మావోయిస్టుల నుండి లేఖ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయినా కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అయ్యారు అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. పోలీసులకు వచ్చిన బెదిరింపు లేఖ ను పోలీసులకు ఇవ్వగా దానిపై ఎంక్వైయిరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రజా సంఘాలు కూడా ఇలాంటి దాడులను ఖండించాలంటూ కొందరు స్థానికులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా మావోయిస్ట్ ల యొక్క కదలికలు నిరూపించుకునేందుకు గాను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఛత్తీస్‌గఢ్ లో పేలుకు సంబంధించి ఇప్పటి వరకు మావోలు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
Also Read: Mamukkoya Died: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.