Bihu Dance Guinness record: అస్సాం రాజధాని గౌహతి ప్రపంచ రికార్డుకు వేదికైంది. ఆ రాష్ట్ర సంప్రదాయ నృత్యమైన బిహూ డ్యాన్స్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. నగరంలోని సరుసాజాయ్ స్టేడియంలో ఒకేసారి 11,304 మంది నృత్యకారులు మరియు సంగీత కళాకారులు బిహూ నృత్యాన్ని ప్రదర్శించి చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమానికి సీఎం హిమంత బిశ్వశర్మతోపాటు పలువురు నేతలు, అధికారులు, అహుతులు హాజరయ్యారు. ఈ వేడుకలో సంప్రాదాయ వాయిద్యాలైన ధోల్‌, తాల్‌, గోగోనా, టోకా, పెపా వంటి వాటిని వాయించే సంగీత కళాకారులు పాల్గొన్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్ని వారాలుగా శిక్షణ పొందిన 7,000 మందికి పైగా డ్యాన్సర్లు, 3,000 మందికి పైగా ‘ధోల్’ డ్రమ్మర్లు మరియు ఇతర సంగీత విద్వాంసులు సరుసజై స్టేడియంలో 15 నిమిషాల పాటు ఈ బిహూ నృత్యరూపకాన్ని ప్రదర్శన నిర్వహించారు. ఈ 'మెగా బిహు'లో పాల్గొనే 11,000 మందికి పైగా "మాస్టర్ ట్రైనర్స్" మరియు రిజర్వ్ డ్యాన్సర్‌లతో పాటు ఒక్కొక్కరికి రూ.25,000 ఇవ్వనుంది అస్సాం ప్రభుత్వం.  అస్సాం సాంస్కృతిక వారసత్వాన్ని  వరల్డ్ వైడ్ గా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇదే స్టేడియంలో 2, 548 మంది డ్రమ్మర్లు డప్పులు వాయించి గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. 


Also Read: Karnataka Elections 2023: హిజాబ్ ఆందోళన నడిపించిన ఎమ్మెల్యేకు షాక్, టికెట్ ఇవ్వని బీజేపీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook