ఢిల్లీలోని బురాడీ ప్రాంతం నుంచి సోమవారం కనిపించకుండా పోయిన 12 తరగతి విద్యార్ధిని మంగళవారం అలీపూర్ లో శవమై కనిపించింది. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పక్కా ప్లాన్ తో హత్య


పోలీసులు కథనం ప్రకారం సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో బురాడీ లోని తన నివాసం నుంచి ఆమె బయటికి వెళ్లింది... కానీ తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా..రంగంలోనికి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో మంగళవారం ఆమె శవం అలీపూర్ ప్రాంతంలో యుమున పుస్తా దగ్గర  కనిపించింది. మృతదేహాన్ని పరిశీలించగా ఆమె గొంతు మరియు శరీరంపై స్పల్ప గాయాలు కనిపించాయి. ఆమెను ఎవరో గొంతునులిమి చంపినట్లు పోలీసులు గుర్తించారు.


కాల్ లిస్ట్ ఆధారంగా.. 


విచారణలో భాగంగా పోలీసులు ఆమె కాల్ లిస్ట్ ను పరిశీలించగా ఒక విషయం బయటికి వచ్చింది. ఆమెతో ఒక అబ్బాయి పదే పదే ఫోన్లో మాట్లాడినట్లు మరియు వందల కొద్ద మెసేజ్ లు ఉన్నట్లు తేలింది. అనుమానం వచ్చిన పోలీసులు... ఆ కాల్ లిస్ట్ లో  ఉన్న అబ్బాయి జితేంద్ర ను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. నిందితుడి ఇచ్చిన సమాచారం ప్రకారం సోమవారం అమ్మాయి కంప్యూటర్ సెంటర్ కోచింగ్ నుంచి తిరిగి వస్తుండగా కాసేపు తిరిగి వద్దామని మాయమటలు చెప్పి ఆమెతో జితేంద్ర బయటకి వెళ్లాడు. అలా తీసుకువెళ్లి గొంతు నులిమి చంపేశాడట.


హత్యకు కారణం ఇదే...


ఒక ఏడాది నుంచి ఆమెతో నిందితుడు జితేంద్రకి పరిచయం ఉందట. అయితే గత  కొన్ని రోజులు అమ్మాయి తనతో మాట్లాడటం లేదట. తాను వేరొకరితో అఫైర్ పెట్టుకొని తనతో సరిగా మాట్లాడటం లేదని  అనుమానం పెంచుకున్నాడు నిందితుడు జితేంద్ర. ఒకనొక సందర్భంలో ఈ విషయంలో ఇద్దరు గొడవపడ్డారట. ఇలా కోపంతో రగిలిపోతున్న జితేంద్ర..ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సమయం కోసం వేచిచూస్తుండగా ఆమె సోమవారం బయట కనిపించడం చూసి మాయ మాటలు చెప్పి ఆమెను నగర శివారు ప్రాంతానికి తీసుకొని వెళ్లి గొంతు నులిమి హతమార్చాడు. నిందితుడి గురించి పోలీసులు విచారించగా అతను స్థానికంగా పెట్రో ల్ బంక్ లో పని చేస్తుంటాడని తెలిసింది. 


 తల్లిదండ్రులకు పోలీసుల సూచన..


తెలిసి తెలియని యుక్త వయసులో చెడు పరిచయాలు ఏర్పడితే ఎంతటి దారుణాలు జరుగుతాయో ఈ ఘటనే ఇందుకు నిదర్శనం..కాబట్టి పిల్లల వ్యహహారం, కదలికలపై తల్లిదండ్రులు ఓ కన్ను వేసి ఉంచాలని.. అవసరాన్ని బట్టి కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు...