12 out of 318 foreign returnees untraceable in Maharashtra amid Omicron fears: దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ కొత్త వేరియెంట్ 'ఒమిక్రాన్‌' (Omicron).. రోజురోజుకు ప్రపంచదేశాలకు పాకుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా దేశాల్లో ఒమిక్రాన్‌ విశ్యరూపం ప్రదర్శిస్తుండగా.. ఇటీవలే భారత్‌ (India)లోకి కూడా ప్రవేశించింది. కొన్ని రాష్ట్రాలలో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు దాదాపుగా 25 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర (Maharashtra)ను ఒమిక్రాన్‌ దడ పుట్టిస్తోంది. అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఓమిక్రాన్‌పై పెరుగుతున్న ఆందోళనల మధ్య కొందరు అదృశ్యమయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల విదేశాల నుంచి మహారాష్ట్ర (Maharashtra)కు మొత్తంగా 318 మంది (318 Foreign Returnees) తిరిగి వచ్చారు. అందులో కనీసం 12 మంది ఆచూకీ ఇప్పుడు తెలియట్లేదు. వీరంతా థానేలోని కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతానికి చెందిన వారే అట. ఈ విషయాన్ని KDMC చీఫ్ విజయ్ సూర్యవంశీ (Vijay Sooryavanshi) తెలిపారు. 'తానేలోని కళ్యాణ్ డోంబివిలీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంకు ఇటీవల 318 మంది విదేశాల నుంచి తిరిగి వచ్చారు. అందులో 12 మంది ఆచూకీ తెలియట్లేదు. వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో అనే సమాచారం కోసం గాలింపు చర్యలు చేపట్టాం. వారి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది' అని సూర్యవంశీ చెప్పారు. 


Also Read: If Yoga Teacher as Umpire: క్రికెట్ మ్యాచ్ జరగుతుండగా అంపైర్ యోగా చేస్తే?.. వీడియో వైరల్


ఇటీవలి కాలంలో విదేశాల నుంచి తిరిగి వచ్చిన కొంతమంది ప్రయాణీకుల మొబైల్ ఫోన్‌లు స్విచ్ ఆఫ్‌లో ఉన్నందున వారి ఆచూకీ కనుక్కోలేకపోతున్నామని, కొందరు ఇచ్చిన ఇంటి అడ్రెస్‌కు వెళితే లాక్ చేయబడి ఉందని సూర్యవంశీ తెలిపారు. ప్రయాణికులు ఇచ్చిన చిరునామాలను ఆరోగ్య శాఖ బృందం ఈరోజు మళ్లీ తనకీ చేస్తుందన్నారు. నవంబర్ 25న దక్షిణాఫ్రికా నుంచి భారత్ వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకిన విషయం తెలిసిందే. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook