Rajya Sabha MP Suspension: పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభమైన తొలి రోజే.. 12 మంది రాజ్యసభ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. వర్షాకాల సమావేశాల చివరి రోజున పార్లమెంట్ లో వీరు సభలో గందరగోళం సృష్టించినందుకు శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు వీరిని సస్పెండ్ చేస్తూ సభ నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సస్పెన్షన్ కు గురైన వారిలో శివసేన పార్టీకి చెందిన ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయ్.. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన డోలా సేన్, శాంత ఛైత్రీ.. సీపీఎం పార్టీకి చెందిన ఎలమారం కరీం తో పాటు కాంగ్రెస్ కు చెందిన ఫులో దేవి నేతం, ఛాయా వర్మ, ఆర్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్.. సీబీఐకి చెందిన భినయ్ విశ్వం రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు.


వర్షాకాల సమావేశాల చివరి రోజున ఈ 12 మంది సభ్యులు తీవ్రంగా ప్రవర్తించారని ప్రభుత్వ నివేదిక పేర్కొంది. సీపీఎం ఎంపీ ఎలమారం కరీం ఓ పురుష మార్షల్‌పై దాడి చేశారని, ఛాయా వర్మ, ఫులో దేవి ఓ మహిళా మార్షల్‌పై దాడి చేశారని తెలిపింది. ఈ నివేదికను రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడుకు సమర్పించింది. వీరికి జారీ చేసిన సస్పెన్షనల్ నోటీసులో వీరు 2021 ఆగస్టు 11న సభ చైర్మన్ అధికారం పట్ల పూర్తిగా అగౌరవాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. పంతంపట్టి సభ కార్యకలాపాలను అడ్డుకున్నారని పేర్కొన్నారు.


“రాజ్యసభ జరిగిన 254వ సెషన్ చివరి రోజు, అంటే ఆగస్టు 11న భద్రతా సిబ్బందిపై ఉద్దేశపూర్వక దాడుల ద్వారా సభ కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తుంది. సభ సభాపతి అధికారాన్ని పూర్తిగా విస్మరించడం, సభా నియమాలను పూర్తిగా దుర్వినియోగం చేయడం, దుష్ప్రవర్తన, ధిక్కార, వికృత, హింసాత్మక ప్రవర్తన, ఉద్దేశపూర్వక దాడుల ద్వారా సభ మర్యాదను దిగజార్చడం వంటి వాటికి పాల్పడ్డారు” అని రాజ్యసభ ఓ ప్రకటనలో పేర్కొంది.


Also Read:PM Modi On Omicron: ‘ఒమిక్రాన్’ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు ప్రధాని మోదీ హెచ్చరిక


Also Read: Farm Laws Repeal Bill 2021: నూతన సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్​సభ ఆమోదం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook