Maharashtra: వామ్మో.. ఇదేం ఘోరం.. ఏకంగా సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలోనే దొంగలు చేతి వాటం.. ఎంత దోచుకేళ్లారంటే?
Maharashtra CM`s swearing-in ceremony: మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారోత్సవం ఆజాద్ మైదాన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సామాన్య ప్రజలతోపాటు విఐపీలు కూడా హాజరయ్యారు. ఫడ్నవీస్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో విఐపీలు, ప్రజలు బిజీగా ఉంటే దొంగలు మాత్రం తమ చేతివాటం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన 13 మంది బంగారంతోపాటు నగదును పోగొట్టుకున్నారు.
Maharashtra CM's swearing-in ceremony: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారోత్సవానికి గురువారం ఆజాద్ మైదాన్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో సామాన్య ప్రజలతోపాటు విఐపీలు కూడా హాజరయ్యారు. హిందూస్థాన్ టైమ్స్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన వార్తల ప్రకారం, ప్రమాణ స్వీకారం సందర్భంగా కనీసం 13 మంది తమ బంగారు గొలుసులు, నగదు,ఇతర విలువైన రూ. 12.4 లక్షల విలువైన వస్తువులను పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇండియన్ జ్యుడీషియల్ కోడ్, 2023లోని సెక్షన్ 303 (2) (దొంగతనం) కింద ఇప్పటివరకు 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, చాలా మంది హాజరైనవారు దొంగతనం ఫిర్యాదులతో తమను సంప్రదించారని ముంబై పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చాలా మంది బాధితులు బంగారు గొలుసులు, పర్సులు, పెద్ద మొత్తంలో డబ్బు మాయమైనట్లు ఫిర్యాదు చేశారని తెలిపారు. బాధితుల నుంచి తీసుకున్న ఫిర్యాదులతో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించడానికి CCTV ఫుటేజీని పరిశీలిస్తున్నామని ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ నుండి ఒక అధికారి తెలిపారు.బాధితుల్లో 64 ఏళ్ల కందివాలి నివాసి శివాజీ గవాలీ ఒకరు. ఆయన స్నేహితులతో కలిసి సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. శివాజీ గవాలీ మాట్లాడుతూ..నేను గేట్ నంబర్ 2 నుండి బయలుదేరినప్పుడు.. సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు. బయటకు వచ్చేసరికి నా 30 గ్రాముల బంగారు గొలుసు కనిపించలేదు. కొంత సేపు వెతికాను.. అయినా దొరకలేదు. ఎవరో దొంగలించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
20 గ్రాముల బంగారు గొలుసును పోగొట్టుకున్న అంధేరికి చెందిన జయదేవి ఉపాధ్యాయ్ (50)తో సహా ఇతరులు కూడా తమ వస్తువులు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోటకు చెందిన సంతోష్ లచ్కే (61) 17 గ్రాముల బంగారు గొలుసు పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. చార్కోప్‌కు చెందిన 72 ఏళ్ల విలాస్ చవాన్ తన 20 గ్రాముల గొలుసు పోయిందని ఫిర్యాదు చేశాడు. దీంతో పాటు దాదర్‌కు చెందిన 70 ఏళ్ల మోహన్‌కామత్‌కు చెందిన 35 గ్రాముల బంగారు గొలుసు పోయిందని పోలీసులకు కంప్లెయింట్ చేశాడు.
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
బంగారంతోపాటు నగదు చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. విలే పార్లేకు చెందిన అనంత్ కోలి (47) రూ. 20,000 నగదు పోగొట్టుకున్నారని, షోలాపూర్‌కు చెందిన నితిన్ కాలే (26) బ్యాగులోంచి రూ 57,000 అపహరణకు గురయ్యాయని పోలీసులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.