టెంట్స్ కూలి 14 మంది మృతి, పలువురికి గాయాలు
టెంట్స్ కూలి 14 మంది మృతి, పలువురికి గాయాలు
బాడ్‌మెర్: రాజస్థాన్‌లోని బాడ్‌మెర్‌లో రాముడి కథ చెప్పే మండపం చోట దుకాణాల కోసం ఏర్పాటు చేసిన టెంట్స్ కూలిన ఘటనలో 14 మంది చనిపోగా మరో 20 మందికిపైగా గాయపడ్డారు. గుడారాలు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
[[{"fid":"178891","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాడ్‌మెర్ ఘటన దురదృష్టకరమని, ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.