బ్రిడ్జిపై తొక్కిసలాట.. 14 మందికి గాయాలు !
బ్రిడ్జిపై తొక్కిసలాటలో 14 మందికి గాయాలు
ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో ఓ బ్రిడ్జిపై తొక్కిసలాటలో 14 మంది గాయపడిన ఘటన పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాకు సమీపంలోని హౌరాలో చోటుచేసుకుంది. సంత్రగచ్చి జంక్షన్‌లోని పాదచారుల వంతెనపై ఇవాళ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి అటుగా వచ్చిన రైల్వే ప్రయాణికుల రద్దీ అధికమై తొక్కిసలాటకు దారితీసినట్టు అక్కడి రైల్వే సీపీఆర్పో సంజయ్ ఘోష్ తెలిపారు. క్షతగాత్రులను అధికారులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలుసుకోవాలనే వారి కోసం భారతీయ రైల్వే సైతం హెల్ప్ లైన్ నెంబర్లను ప్రకటించింది. బాధితుల సమాచారం కోసం 032221072 (ఖరగ్‌పూర్), 03326295561 (సంత్రగచ్చి) హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించాల్సిందిగా భారతీయ రైల్వే పేర్కొంది. దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో కోల్‌కతాకు ప్రత్యేకమైన గుర్తింపున్న సంగతి తెలిసిందే.