Parliament Session:తాజాగా జరిగిన  18 వ లోక్ సభ ఈ నెల 24న తొలిసారి కొలువు తీరనుంది. ఈ విషయయాన్ని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఈ సెషన్ లో  ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముందుగా రాష్ట్రపతి .. ప్రోటెం స్పీకర్ తో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత.. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ సెషన్ లో కీలకమైన లోక్ సభ స్పీకర్  ఎన్నిక జరగనుంది. 18వ లోక్ సభకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెను కొత్తగా స్పీకర్ గా ఎన్నిక అవుతుందా.. ? వేరే ఎవరికైనా ఛాన్స్ దక్కుతుందా అనేది చూడాలి.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మరోవైపు ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ ను ప్రవేశ పెట్టిన కేంద్రం.. ఈ సమావేశాల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అంతేకాదు ఈ నెల 27వ తేదిన  రాజ్యసభ సమావేశాలను ప్రారంభం కానున్నాయి. ఈ సారి రాజ్యసభకు సంబంధించి 264వ సమావేశం కావడం గమనార్హం. జూన్ 27వ తేదినే రాష్ట్రపతి రెండు సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అంతేకాదు ఈ ఐదేళ్లలో ప్రభుత్వం చేయాలనుకున్న పనులను రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపరచనున్నారు.


అంతేకాదు గత పదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు.  ఇంకోవైపు ప్రతిపక్షాలు తొలి సెషన్ లో పలు అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందకు రెడీ అవుతున్నాయి.ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా 240 స్థానాల దగ్గరే ఆగిపోయింది. మిత్రపక్షాలతో కలిపి 292 స్థానాలను గెలుచుకుంది. ఎన్నికల తర్వాత పలు స్వతంత్య్ర అభ్యర్ధుల మద్ధతుతో బీజేపీ బలం 300 క్రాస్ అయింది.


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter