Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో లష్కరే తయ్యబా కమాండర్ యూసుఫ్ కంత్రూ ఉన్నాడు. గురువారం ఉదయం ప్రారంభమైన ఎన్‌కౌంటర్ రెండ్రోజులుగా కొనసాగుతోంది. యూసుఫ్ కంత్రూ మోస్ట్ వాంటెడ్ టాప్ టెన్ లిస్ట్‌లో ఉన్నాడని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) విజయ్ కుమార్ తెలిపారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని, మరో ముగ్గురు ఉగ్రవాదులు ఉండవచ్చని కశ్మీర్ ఐజీపీ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ సిబ్బంది, ఒక పౌరుడు సహా ఐదుగురు గాయపడ్డారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బుద్గాం పోలీసులు, ఆర్మీ ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Delhi Covid Cases: ఢిల్లీలో కొత్త వేరియంట్ కలకలం... కేసుల పెరుగుదలకు అదే కారణమా...?


Also Read: MLA slaps Youth: రోడ్లు, తాగునీరు అడిగినందుకు.. యువకుడి చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.