యూపీ సీఎంపై అసభ్యకర పోస్టు ; యువకుడి అరెస్ట్
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై అసభ్యకరమైన పోస్టు చేసిన 22 ఏళ్ల రాహత్ అనే యువకుడు అరెస్ట్ అయ్యాడు. హిందూ యువ వాహిని సభ్యుడు నర్సింగ్ పాండే ఫిర్యాదు మేరకు అతన్ని దంకౌర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సింగ్ ఫిర్యాదులో పేర్కొ్న్న దాని ప్రకారం రాహత్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించి అసభ్యకరమైన చిత్రాన్ని ఫోటోషాప్ ద్వారా తయారు చేసి.. దాన్ని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశాడని..ఇంతటితో ఆగకుండా.. ఇతను యోగినా ? లేదా భోగీయా అంటూ కామెంట్ పెట్టాడట. ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండంతో ఈ మేరకు నర్సింగ్ పాండే ఫిర్యాదు చేశారు. ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా బాధిస్తాయనీ.. అందుకే తాను కేసు పెట్టినట్టు పాండే వెల్లడించారు. కాగా నర్సింగ్ పాండే ఫిర్యాదు ఆధారంగా రాహత్ ను అరెస్ట్ చేసినట్లు దంకౌర్ పోలీసులు వెల్లడించారు.