24 గంటల్లోనే 773 కేసులు, 35 మరణాలు
దేశంలోని కరోనా బాధితుల సంఖ్య 5,194కు చేరుకుంది. అందులో 401 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
CoronaVirus Updates| న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బుధవారం (ఏప్రిల్ 8) ఉదయం 10 గంటల వరకు దేశంలోని కరోనా బాధితుల సంఖ్య 5,194కు చేరుకుంది. కరోనా మరణాల సంఖ్య 149కి చేరుకుంది. గత 24 గంటల్లో 35 మంది కరోనా వైరస్ సోకి చనిపోయారు. అల్లు అర్జున్‌కు చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్
మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఒక్కరోజులోనే 774 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేటి ఉదయం వెల్లడించింది. ఇందులో ప్రస్తుతం 4,643 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 401 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. కరోనా పాజిటివ్ కేసుల్లో 70 మంది విదేశీయులున్నారు. ఈ మెగాస్టార్ ఆ చిరంజీవికి ‘మెగా’ అభిమాని
కాగా, మహారాష్ట్రలో అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి. 64 మరణాలతో ఆ రాష్ట్రం తొలి స్థానంలో ఉంది. 1018 పాజిటీవ్ కేసులతో కరోనా వైరస్ ఆ రాష్ట్రాన్ని పీడిస్తుంది. తమిళనాడు 690, ఢిల్లీ 576, తెలంగాణ 404, కేరళ 336, రాజస్థాన్ 328, ఉత్తర్‌ప్రదేశ్ 326, ఆంధ్రప్రదేశ్ 314 పాజిటీవ్ కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ