పాక్ నియంత్రణ రేఖ వద్ద మరోసారి దాడులకు తెగబడింది. ఎలాంటి కవ్వింపు చర్యలు చేయకున్నా భారత్ పై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఆర్మీ అధికారి, ముగ్గురు జవాన్లు చనిపోయారు. జమ్మూలోని ఫూంచ్, రాజౌరీ ప్రాంతాల్లో ఆదివారం పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"పాకిస్తాన్ సైనిక దళాలకు భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. ప్రతీకారం తీర్చుకుంది. వారికి భారీ నష్టాన్ని కలిగించింది. అయితే ఎదురుకాల్పుల్లో ఒక అధికారి, ముగ్గురు జవాన్లు చనిపోయారు. ఇండియన్ ఆర్మీ సైనికుల అమరత్వం వ్యర్థం కాదు. పాకిస్థాన్ సైన్యానికి తగినట్లుగా స్పందిస్తారు" అని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.


నివేదికల ప్రకారం, పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం ఈ దాడి జరిపినట్లు తెలిసింది. ఈ టీంలో పాక్ ఆర్మీ కమాండోలు, లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నారు.  భారత్-పాక్ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత స్థావరాలను లక్ష్యంగా చసుకుని దాడులకు తెగబడుతున్నారు. కాగా దాడి తరువాత రాజౌరి జిల్లాలోని అన్ని పాఠశాలలు ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు.