న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 478 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో కరోనా వైరస్ సోకడం మొదలైన తర్వాత 24 గంటల్లో ఇంత అత్యధికంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఇండియాలో ఇప్పటివరకు గుర్తించిన కోవిడ్ (COVID) కేసుల సంఖ్య 2547 కు చేరింది. 2547 కేసుల్లో 2322 యాక్టివ్ కేసులు, 162 వ్యాధి నయమై డిశ్చార్జ్ చేసిన కేసులు, 62 మృతి చెందిన కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ వెల్లడించినట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ స్పష్టంచేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : కరోనా చికిత్సకు సహకరించని ముస్లింలకు అదే శిక్ష విధించాలి: రాజా సింగ్


ఇదిలావుంటే, కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయి. పాలు, పండ్లు, కూరగాయలు లాంటి నిత్యావసరాల కోసం జనం ఇళ్లలోంచి బయటికి వెళ్లాలంటే ఆలోచించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం ఢిల్లీ సర్కార్ (Delhi govt) సైతం కేంద్రం ముందు పలు డిమాండ్లు ఉంచింది. అత్యవసరంగా 1 లక్షపర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ కిట్స్ (PPE kits), 50000 కోవిడ్ టెస్టింగ్ కిట్స్ (COVID testing kits), 200 వెంటిలేటర్స్ (Ventilators) సరఫరా చేయాల్సిందిగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..