5th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5వ విడత ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. 5వ విడదతో భాగంగా 49 లోక్ సభ సీట్లకు రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ సారి ఎన్నికలతో మహారాష్ట్రలోని అన్ని స్థానాలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. మొత్తంగా దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 49 సీట్లకు ఎన్నికలు జరగున్నాయి. బిహార్‌లో 5 లోక్ సభ సీట్లతో పాటు.. మహారాష్ట్రలోని కీలకమైన రాజధాని ముంబై సహా పరిసర ప్రాంతాల్లోని 13 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఒడిషాలోని 5 లోక్‌సభ సీట్లతో పాటు 35 అసెంబ్లీ సీట్లకు రేపు పోలింగ్ జరగనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లోని 14 స్థానాలు.. పశ్చిమ బంగలోని 7 స్థానాల.. ఝర్ఖండ్‌లోని 3 స్థానాలతో పాటు జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా, లడక్ లోక్ సభ సీటుకు ఈ విడతతో ఎన్నికల ప్రక్రియ పూర్తైవుతోంది. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేస్తోన్న కీలకమైన రాయ్ బరేలితో పాటు స్మృతీ ఇరానీ పోటీ చేస్తోన్న అమేఠి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పోటీ చేస్తోన్న లక్నో పాటు.. మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్  ముంబై నార్త్ నుంచి బరిలో ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో బాలీవుడ్ తారాగణం మొత్తం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


ఇక వెస్ట్ బెంగాల్లో 5వ విడతలో జరగనున్న 7 లోక్ సభ స్థానాలు అత్యంత సున్నితమైనవి ఈసీ పేర్కొంది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మురోవైపు ఒడిషాలోని జరగుతున్న 5 లోక్ సభ సీట్లు కూడా అత్యంత సున్నితమైనవిగా ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.


ఐదో విడద ఎన్నికలతో దేశ వ్యాప్తంగా 429 లోక్ సభ సీట్లకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. మరో రెండు విడతల్లో 114 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది. 18వ లోక్ సభ జరగుతున్న ఈ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన పార్టీ దిల్లీ పీఠంపై కూర్చుంటారు. మొత్తంగా ఎన్నికల దేశానికి కాబోయే ప్రైమ్ మినిష్టర్ ఎవరనేది జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.


Also Read: Low Depression: బంగాళాఖాతంలో అల్పపీడన హెచ్చరిక, ఏపీలో అతి భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter