Encounter In Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్, కుల్గాం జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జెఇఎం)కి (Jaish-e-Mohammed) చెందిన ఆరుగురు ఉగ్రవాదులు (terrorists) హతమయ్యారు. మరణించిన వారిలో నలుగురు ఉగ్రవాదులను ఇప్పటివరకు గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు కశ్మీర్‌లోని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్విటర్‌లో వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నిషేధిత ఉగ్రవాద సంస్థ జెఇఎమ్‌కి చెందిన 6 ఉగ్రవాదులు హతమయ్యారు. మరణించిన ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్తాన్ కు చెందిన వారు కాగా..మరో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు. మరో ఇద్దరు ముష్కరులు ఎవరనేది భద్రతా బలగాలు పరిశీలిస్తున్నాయి. మాకు ఇది పెద్ద విజయం'' అని  కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.




Also Read: Good News: పెట్రోల్ పై రూ. 25 తగ్గించిన రాష్ట్రం.. జనవరి 26 నుండి అమల్లోకి..


బుధవారం కుల్గాం జిల్లాలోని మిర్హామా ప్రాంతంలో (Mirhama area) ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ( cordon and search operation) ప్రారంభించాయి. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతనాగ్​ జిల్లాలోని నౌగామ్​ షాహ్​బాద్​ ప్రాంతంలో (Nowgam Shahabad area) కూడా ఉగ్రవాదులు పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా.. ఓ అధికారి గాయపడ్డారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి