ఒడిశా: ఆరుగురు మావోలు మృతి
ఒడిశాలోని బాలంగీర్ జిల్లాల్లో అటవీప్రాంతాల్లో ఆదివారం రాత్రి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఒడిశాలోని బాలంగీర్ జిల్లాల్లో అటవీప్రాంతాల్లో ఆదివారం రాత్రి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు నక్సల్స్ హతమయ్యారు.
ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు పక్కా సమాచారం అందడంతో సీఆర్పీఎఫ్, డీబీఎఫ్ దళాలు కూంబింగ్ నిర్వహించాయని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఓ ఇంటి వద్ద ఇద్దరు మావో కమాండర్లు కనిపించి పోలీసులపై కాల్పులకు దిగారు. ఎదురు కాల్పుల్లో వారిద్దరూ మృతిచెందారు. అనంతరం పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగించారు. అర్థరాత్రి సమయంలో మరోమారు ఎదురుకాల్పులు జరుగగా నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.