60 Hostel Girls Walked for 17 km at Night: కస్తూర్బా గాంధి రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకుంటున్న 60 మంది విద్యార్థినులు రాత్రి పూట 17 కిమీ నడుచుకుంటూ వెళ్లి మరీ కలెక్టరేట్‌లో డిప్యూటీ కమిషనర్ ఎదుట తమ నిరసన వ్యక్తంచేశారు. రెసిడెన్షియల్ కాలేజీలో తమ వార్డెన్ తమపై సాగిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావంటూ విద్యార్థినులు ముక్తకంఠంతో డిప్యూటీ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. కాలేజీ హాస్టల్ వార్డెన్ తమని రాచిరంపాన పెడుతోందని వాపోయారు. పాచిపోయిన ఆహారం వడ్డిస్తోందని.. ప్రభుత్వం సౌకర్యాలు అందించినా.. అవేవీ తమ వరకు చేరకుండా నేలపై పడుకోవాలని ఆదేశిస్తోందని... తమ చేతే టాయిలెట్స్ కడిగించడం చేస్తోందని డిప్యూటీ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. సీనియర్ అధికారులకు చెబితే కొడతానని బెదిరిస్తోందని విద్యార్థినులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జార్ఖండ్ లోని చాయిబస జిల్లాలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రంతా గజగజ వణికించే చలిలో నిర్మానుష్యమైన రోడ్లపై నడుచుకుంటూ వెళ్లి సోమవారం ఉదయం 7 గంటలకు చాయిబస కలెక్టరేట్ కి చేరుకున్నారు. అక్కడికి చేరుకోవడంతోనే స్థానిక కాంగ్రెస్ ఎంపీ గీతా కోడకు ఫోన్ చేసి తమ సమస్యను చెప్పుకున్నారు. దీంతో విద్యార్థుల సమస్యలను డిప్యుటీ కమిషనర్ అనన్య మిటల్ దృష్టికి తీసుకెళ్తూ వారిని అక్కడికి తీసుకెళ్లారు. 


విద్యార్థినులు చెప్పిన సమస్యలు అంతా విన్న డిప్యుటీ కమిషనర్ అనన్య మిటల్.. వెంటనే జిల్లా విద్యా శాఖ సుపరింటెండెంట్ అభయ్ కుమార్ షిల్ ని అక్కడికి పిలిపించారు. ఘటనపై విచారణకు ఆదేశించి వార్డెన్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా అభయ్ కుమార్ కి సూచించారు. సీనియర్ అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని విద్యార్థినులకు జిల్లా విద్యా శాఖ సుపరింటెండెంట్ అభయ్ కుమార్ షిల్ భరోసా ఇచ్చారు. అనంతరం విద్యార్థినులను వాహనాల్లో ఎక్కించి తిరిగి ఖుంత్పానీలోని కస్తూర్బా గాంధి రెసిడెన్షియల్ కాలేజీకి పంపించారు. 60 మంది విద్యార్థినులు అంత రాత్రి వేళ చలిని లెక్కచేయకుండా, నిర్మానుష్యమైన రోడ్లపై నడచుకుంటూ కలెక్టరేట్ వరకు చేరుకున్నారంటే.. వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉండి ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఇది కూడా చదవండి : Mahindra XUV400 EV: మహింద్రా నుంచి మరో కొత్త బాహుబలి.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 456 కిమీ రేంజ్


ఇది కూడా చదవండి : Salary Hikes in 2023: జీతాల పెంపుపై ప్రైవేటు ఉద్యోగులకు పెద్ద గుడ్ న్యూస్


ఇది కూడా చదవండి : Govt Employees Basic Salary: ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్ 2023 తరువాత సూపర్ గుడ్ న్యూస్ ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook