డెల్టా ప్లస్ పంజా...మహారాష్ట్రలో వరుస మరణాల కలకలం!
Delta Plus Variant: మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఐదుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
Delta Plus Variant: మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ పంజా విసురుతోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 66 మందికి డెల్టా ప్లస్ సోకినట్లు నిర్ధారణ కాగా.. అందులో అయిదుగురు ఇప్పటికే మృత్యువాత పడ్డారు.
ఈ డెల్టాప్లస్(Delta Plus Variant) కేసుల్లో అత్యధికంగా జల్ గావ్ జిల్లాలో(13) నమోదయ్యాయి. రత్నగరి జిల్లాలో 12 కేసులున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై(Mumbai) నగరంలో 11 మందికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకింది. అయితే ఈ 66 మందిలో 32 మందిపై వైరస్ ప్రభావం అంతగా లేదని అధికారులు వెల్లడించారు. డెల్టా ప్లస్ వేరియంట్ తో మరణించిన వారంతా 65 ఏళ్ల వయసు పైబడిన వారు కావడంతోపాటు వారికి ఇతర అనారోగ్యాలున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ కేసుల్లో 18 ఏళ్ల లోపు వయసు వారు ఉండడం గమనార్హం. దీంతో అటు అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: Mumbai: డెల్టా ప్లస్ వేరియంట్‌తో ముంబయిలో తొలి మరణం
డెల్టా ప్లస్(Delta Plus Variant) వైరస్ వల్ల మరణించిన వారిలో టీకాలు(Covid Vaccine) వేయించుకున్నవారు కూడా ఉండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం థానే నగరంలో మరో డెల్టా ప్లస్ వేరియంట్ కొత్త కేసు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఆగస్టు 15వ తేదీ నుంచి అన్‌లాక్ 3.0లో భాగంగా పలు ప్రాంతాల్లో ఆంక్షలను సడలిస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో ఈ డెల్టా ప్లస్ వేరియంట్(Delta Plus Variant) విస్తరణపై ఎలా ప్రభావం చూపనుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర(Maharastra) సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణికులు కరోనా టీకా రెండు డోసులు తీసుకుని ఉండాలని రూల్ పెట్టింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook