6th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు హడావుడి నెలకొంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 5 విడతల్లో 428 సీట్లకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మరో 115 స్థానాలకు ఎన్నికలతో ఈ క్రతువు పూర్తవుతోంది. అందులో ఆరో విడతలో భాగంగా రేపు దేశ వ్యాప్తంగా హర్యానాలోని 10 స్థానాలు.. కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీలో 7 స్థానాల.. 3 విడతలో భాగంగా జరగాల్సిన జమ్మూ కశ్మర్‌లోని అనంత నాగ్ రాజౌరితో ఎన్నిక ఇపుడు ఆరో విడతలో నిర్వహిస్తున్నారు.  పాటు ఉత్తర ప్రదేశ్‌లోని 14 స్థానాలు..  వెస్ట్ బెంగాల్‌లో 7 స్థానాలు..జార్ఖండ్‌లోని 4 స్థానాలు.. ఒడిషాలో 6 లోక్ సభ సీట్లతో 42 అసెంబ్లీ సీట్లకు కలిపి మొత్తంగా 58 స్థానాలకు ఎన్నికలు జరగున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసారి ఎన్నికల బరిలో హర్యాణలోని కర్నాల్‌ నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్ ఖట్టర్, ఒడిషాలోని సంబల్ పూర్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్, పూరీ నుంచి సంబిత్ పాత్ర, కురుక్షేత్ర నుంచి నవీన్ జిందాల్, గురుగ్రామ్ నుంచి రావ్ ఇంద్రజిత్ సింగ్,  ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్ పూర్ నుంచి మేనకా గాంధీ, అనంత్ నాగ్ రాజౌరి నుంచి పీడీపీ ఛీప్ మెహబూబా ముఫ్తీ ఎన్నికల బరిలో ఉన్నారు. అటు నార్త్ ఈస్ట్ దిల్లీ స్థానాం నుంచి బీజేపీ తరుపున మనోజ్ తివారి, కాంగ్రెస్ తరుపున వివాదాస్పద నేత కన్హయ్య కుమార్ బరిలో ఢీ అంటే ఢీ అంటున్నారు.


6వ విడత ఎన్నికలతో దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు 486 సీట్లకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తోంది. ఏడో విడతలో  జరిగే 57 సీట్లకు జరిగినే ఎన్నికతో దేశ వ్యాప్తంగా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. 18 లోక్‌సభకు జరగుతున్న ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకున్న పార్టీనే  కేంద్రంలో అధికారం చేపట్టనుంది. మొత్తంగా ఈ ఎలక్షన్ మన దేశ  ప్రధానిని నిర్ణయించే ఎన్నికలు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. మొత్తంగా ఎన్నికల దేశానికి ఎవరు ప్రధాని కానున్నారనేది జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది.


Also Read: Women Sits In Pothole: రోడ్డు సమస్యపై మౌన నిరసన.. బురదలో కూర్చున్న మహిళ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter