Maharashtra Political Crisis: మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా కొనసాగుతోంది. శివసేనలో తలెత్తిన చీలికతో సంకీర్ణ ప్రభుత్వం కూలే పరిస్థితి ఏర్పడింది. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. వీరంతా అస్సాం గౌహతిలోని ఓ హోటల్‌కు మకాం మార్చారు. శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్‌నాథ్‌ షిందే నేతృత్వంలో ప్రత్యేక శిబిరం నడుస్తోంది. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారని ఇప్పటికే ఆయన ప్రకటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీరి కోసం గౌహతిలో ఓ విలాసవంతమైన హోటల్‌ను బుక్‌ చేశారు. తాజాగా ఈహోటల్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఠాక్రేపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఎమ్మెల్యేలు మొదట సూరత్‌లోని ఓ హోటల్‌లో శిబిరం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఓవర్‌ టూ అస్సాంకు మారింది. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ప్రస్తుతం అసమ్మతి నేతలు ఉన్నారు. 


ఈఫైవ్ స్టార్ హోటల్‌లో ఎమ్మెల్యేల కోసం 7 రోజులకు గాను 70 రూమ్‌లు బుక్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. 7 రోజులకు రూమ్‌ల ఖర్చు అక్షరాల రూ.56 లక్షలుగా ఉంది. వీటికి అదనంగా ఆహారం, ఇతర సేవలన్నీ కలుపుకుని ఒక్క రోజుకు రూ.8 లక్షల వరకు ఖర్చు అవుతుందని హోటల్‌ వర్గాలే  చెబుతున్నాయి. రాడిసన్ బ్లూ ఫైవ్ స్టార్ హోటల్‌లో మొత్తం 196 రూమ్‌లు ఉన్నాయి. 


తిరుగుబాటు ఎమ్మెల్యేల కోసం 70 గదులు ఉన్నాయి. ప్రస్తుతం హోటల్‌లో బుక్‌ అయిన రూమ్స్‌ మాత్రమే ఉన్నాయని హోటల్ యాజమాన్యం చెబుతోంది. మిగిలిన రూమ్‌లకు సైతం బుకింగ్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు హోటల్‌లో ఉన్న వారికి తప్ప..బయటకు వారికి హోటల్‌లో అనుమతి లేదని తెలుస్తోంది. గౌహతికి వచ్చేందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ఛార్టెడ్ విమానం వాడినట్లు ప్రచారం జరిగింది. దానికి ఎంత ఖర్చు అయిందన్న సమాచారం లేదు. ఇదంతా ఎవరూ భరిస్తున్నారన్న విషయం తెలియరాలేదు.


Also read:Agniveer Recruitment 2022 Air Force: అగ్నివీర్‌గా మారాలనుకుంటున్నారా..వాయుసేన నుంచి రిజిస్ట్రేషన్‌ షురూ..!


Also read:AP Cabinet: నూతన పథకాలకు ఏపీ కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్..మంత్రి వర్గ నిర్ణయాలు ఇవే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.