Accident: 7 dead and 32 injured after a bus and a Bolero collided: లక్నో‌: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ( 7 dead) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శనివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ ఫిలిబిత్ జిల్లా పురాన్‌పుర్‌ ప్రాంతంలో బస్సు - బొలెరో వాహనం ఢీకొని ( bus and Bolero collided) ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 32 మందికి గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను బస్సు, బొలెరో వాహనం నుంచి బయటకు తీశారు. సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు (UP Police), స్థానికులు కలిసి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"195137","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"up","field_file_image_title_text[und][0][value]":"రోడ్డు ప్రమాదం"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"up","field_file_image_title_text[und][0][value]":"రోడ్డు ప్రమాదం"}},"link_text":false,"attributes":{"alt":"up","title":"రోడ్డు ప్రమాదం","class":"media-element file-default","data-delta":"1"}}]]


అయితే.. బస్సు, బొలెరో ఒకదానికొకటి ఢికొనడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని ఫిలిబిత్ ఎస్సీ జై ప్రకాశ్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎడుగురు మరణించారని ఆయన వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే.. అక్టోబరు 10న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అలీగ‌ఢ్ జిల్లాలోని త‌ప్పల్ ప్రాంతంలో అదుపుత‌ప్పి (bus overturned ) బోల్తాప‌డిన సంఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో బస్సులో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మ‌ర‌ణించారు. 


Also read: IPL 2020: కోల్‌కతాపై ముంబై ఘన విజయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe