7th Pay Commission DA Arrears: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పంజాబ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. డియర్‌నెస్ అలవెన్స్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. గతంలో శిరోమణి అకాలీదళ్‌-బీజేపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న  6 శాతం డీఏను విడుదల చేస్తున్నట్లు సీఎం భగవంత్ మాన్ తెలిపారు.  పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరిస్తున్నట్లు గతంలో పంజాబ్ ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటివరకు అమలు కాలేదు. ఓపీఎస్‌ను అమలు చేయలంటూ ఉద్యోగులు పెద్ద ఆందోళనలు చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న డీఏను విడుదల చేస్తామని ప్రకటించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్ర పరిపాలనలో ఉద్యోగులు ముఖ్యమైన భాగమని.. వారి ప్రయోజనాలను పరిరక్షించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం భగవంత్ మాన్ అన్నారు. జూలై 2015 నుంచి డిసెంబర్ 31, 2015 వరకు పెండింగ్‌లో ఉన్న 6 శాతం డీఏను విడుదల చేస్తున్నట్లు సీఎం కార్యాలయ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై రూ.356 కోట్ల ఆర్థిక భారం పడుతుందన్నారు. 


సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద బహుమతి అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయి ఉన్న డియర్‌నెస్ అలవెన్స్‌లో ఒక విడతను విడుదల చేశామని తెలిపారు. ఉద్యోగుల బకాయిలు 6 శాతం ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. తాము ఏది చెబితే అది చేసి చూపిస్తామని చెప్పారు. 2015 జూలై 1 నుంచి 2015 డిసెంబర్ వరకు 31వ తేదీ వరకు డీఎ విడుదలకు ఆమోదించినట్లు వెల్లడించారు. 


పెండిగ్‌లో ఉన్న డియర్‌నెస్‌ అలవెన్స్ విడుదల కోసం ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్‌కు అంగీకరించి పెండింగ్ విడుదలకు ఆప్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వాల బకాయిలను కూడా ఆప్ ప్రభుత్వం చెల్లిస్తుందని ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా అన్నారు. దాదాపు 8 ఏళ్ల తరువాత పెండింగ్ డీఏ అకౌంట్‌లోకి జమ కానుండడంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది.


Also Read: Akash Madhwal IPL: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఆకాశ్ మధ్వాల్.. ముంబై ఎంత ఖర్చు చేసిందంటే..?  


Also Read: Hyderabad Woman Murder Case: సంచలనం రేకెత్తిస్తున్న మహిళ హత్య కేసు.. చిన్న క్లూతో నిందితుడిని పట్టేశారు   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook