DA Hike News: ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై డీఏ 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఎరియర్లతో కలిపి అక్టోబర్ నెల జీతం భారీగా అందుకోనున్నారు. ఆ తరువాత కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగుల డీఏ పెంపుపై ప్రకటన విడుదల చేశాయి. తాజాగా అస్సోం ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అస్సోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని కేబినెట్ డీఏ పెంపును ఆమోదించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అస్సోం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 3 శాతం పెంచేందుకు అంగీకరించింది. కేబినెట్ సమావేశంలో డీఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు దీపావళి కానుకగా అందనుంది. ఈ ఏడాదిలో మొదటి సారి మార్చ్ నెలలో డీఏను 4 శాతం పెంచడంతో మొత్తం డీఏ కేంద్ర ప్రబుత్వ ఉద్యోగుల డీఏకు సమానంగా 50 శాతానికి చేరుతుంది. ఇప్పుడు మరో 3 శాతం పెంచడంతో 53 శాతం అవుతోంది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏతో సమానమైంది. జూలై నుంచి లెక్కించి మొత్తం బకాయిలను వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ నాలుగు విడతల్లో చెల్లించనుంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఉద్యోగులు రివైజ్డ్ డీఏతో జీతం అందుకోనున్నారు. 


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెరిగిన డీఏను ఎరియర్లతో కలిపి అక్టోబర్ నెల జీతంతో అందుకోనున్నారు. ఏకంగా నాలుగు నెలల డీఏ కావడంతో అక్టోబర్ జీతం భారీగా ఉండనుంది. వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్‌లో 8వ వేతన సంఘం ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. 


Also read: New Pension Rule: పెన్షనర్లకు దీపావళి గిఫ్ట్, ఇక ప్రతి నెలా అదనపు పెన్షన్, కొత్త నిబంధనలివే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.