Central Government 7th Pay Commission DA Hike Latest Update: డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) పెంపు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. డియర్‌నెస్ అలవెన్స్‌పై సెప్టెంబర్ 28న (నవరాత్రి మూడో రోజున) కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ నెల జీతం రెండు నెలల బకాయితో వస్తుందట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ ఏటా రెండు సార్లు డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) పెంపు ఉంటుందన్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఎంత పెరుగుతుందనే దాని కోసం కేంద్ర ప్రభుత్వం AICPI-IW (ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్- ఇండస్ట్రియల్ వర్కర్) ఇండెక్స్ డేటాను ఉపయోగిస్తుంది. AICPI-IW మొదటి సగం గణాంకాలు విడుదలయ్యాయి. జూన్‌లో సూచీ 129.2కి చేరింది. ఇండెక్స్ పెరగడం వల్ల డీఏలో 4 శాతం పెరగనుంది. ఈ పెంపుతో కోటి మందికి పైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచిన తర్వాత కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 38% అవుతుంది. 


ఇంతకుముందు జనవరికి డియర్‌నెస్ అలవెన్స్‌ను ప్రభుత్వం మార్చిలో ప్రకటించింది. అప్పుడు 31 నుంచి 34 శాతానికి డీఏ పెంచారు. పెంచిన డియర్‌నెస్ అలవెన్స్ జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. నవరాత్రుల శుభదినాలలో ప్రభుత్వం డీఏ చెల్లిస్తే.. ఉద్యోగుల జేబులు కాసులతో నిండిపోనున్నాయి. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు 34% డియర్‌నెస్ అలవెన్స్ అందుతోంది. డీఏ 38 శాతంకు పెరిగితే..  కనీస మరియు గరిష్ట బేసిక్ జీతం ఎంత ఉంటుందో ఓసారి చూద్దాం. 


గరిష్ట ప్రాథమిక జీతం:
1. ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ. 56,900
2. కొత్త డీఏ (38%) రూ. 21,622/నెలకు
3. డీఏ ఇప్పటివరకు (34%) రూ. 19,346/నెలకు
4. డీఏ 21,622-19,346 = రూ 2260/నెలకు
5. వార్షిక వేతనం 2260 X12 = రూ 27,120 పెంపు


కనీస ప్రాథమిక జీతం:
1. ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ.18,000
2. కొత్త బేసిక్ (38%) రూ. 6840/నెలకు
3. డీఏ ఇప్పటివరకు (34%) రూ. 6120/నెలకు
4. డీఏ ఎంత పెరిగింది 6840-6120 = రూ.720/నెలకు
5. వార్షిక వేతనం 720X12 = రూ. 8640 పెంపు



Also Read: కోహ్లీ, రోహిత్ బ్రోమాన్స్.. అచ్చు చిన్న పిల్లల్లా సెలబ్రేషన్స్! వైరల్ అవుతున్న వీడియో


Also Read: IND vs AUS: రామ్ చరణ్ ఇంట్లో టీమిండియా స్టార్ ప్లేయర్స్ సందడి.. హార్దిక్, సూర్య సహా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook