Central Govt Employees DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా గుడ్ న్యూస్ వచ్చేసింది. ఏడవ వేతన సంఘం కింద డియర్‌నెస్ అలవెన్స్‌ (డీఏ)ను 4 శాతం పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉద్యోగులకు డీఏ 34 శాతం ఉండగా.. 38 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రత్యేక డీఏను పెంచనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐదు, ఆరో వేతన కమీషన్ల కింద వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు కూడా కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా ఇచ్చింది. ఈ రెండు పే కమీషన్ల కింద ప్రభుత్వం డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది.


ఆరవ వేతన సంఘం కింద ఉద్యోగులకు కరువు భత్యం 9 శాతం పెంచింది. ప్రస్తుతం 203 శాతం ఉండగా.. 212 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా పెంచిన డీఏ రేట్లు జూలై 1, 2022 నుంచి అమలు చేయనుంది. ఉద్యోగులకు అక్టోబర్ నెల జీతంతో పాటు మూడు నెలల బకాయిలు చెల్లించనుంది.


 ఐదవ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 15 శాతానికి పెంచారు. గతంలో ఐదవ వేతన సంఘం కింద పనిచేస్తున్న ఉద్యోగులకు 381 శాతం డీఏ పొందాలనే నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని 396 శాతానికి పెంచారు. తాజాగా పెంచిన డీఏ కూడా జూలై 1 నుంచి అమల్లోకి రానుంది.


ఉద్యోగుల బేసిక్ శాలరీ ఆధారంగా డీఏను పెంచనున్న విషయం తెలిసిందే. ఒక ఉద్యోగి మూల వేతనం నెలకు రూ.43 వేలు అయితే.. అతను పాత డీఏ (203%) ప్రకారం రూ.87,290 పొందుతాడు. ప్రస్తుతం డీఏ 212 శాతం పెంచడంతో.. రూ.91,160కి పెరగనుంది. నెలవారీగా దాదాపు రూ.3800 జీతం పెరుగుతుంది. దీపావళి పండుగకు గుడ్ న్యూస్ రావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook