7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా గిఫ్ట్.. డీఏ పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Cabinet Approves DA Hike: డీఏ పెంపునకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగు శాతం పెంపునకు ఆమోద ముద్ర వేసింది. పెరిగిన డీఏ 46 శాతానికి చేరుకుంది. తాజా పెంపు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. పూర్తి వివరాలు ఇలా..
Cabinet Approves DA Hike: ఊహించినట్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా, దీపావళి కానుక వచ్చేసింది. దేశవ్యాప్తంగా 48 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు తీపి కబురు చెబుతూ డీఏ 4 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి చేరుకుంది. దీంతో ఉద్యోగుల జీతాల్లో భారీగా పెరుగుదల ఉండనుంది. పెరిగిన డీఏ జూలై 1వ తేదీ నుంచి వర్తించనుంది. మూడు నెలల బకాయిలు కలిపి అక్టోబర్ నెల జీతంతో చెల్లించనుంది.
కనీస ప్రాథమిక వేతనం రూ.18 వేలు ఉన్న వారికి ప్రస్తుత 42 శాతం డీఏ ఫలితంగా నెలవారీ అదనపు ఆదాయం రూ.7,560. 46 శాతం డీఏతో వారి నెలవారీ జీతం రూ.8,280కి పెరిగింది. గరిష్టంగా రూ.56,900 ప్రాథమిక వేతనం కలిగిన వారికి ప్రస్తుతం 42 శాతం ప్రకారం రూ.23,898 డీఏ అందుకుంటున్నారు. 46 శాతానికి పెంపుతో డీఏ 26,174 రూపాయలకు పెరిగింది. పెన్షనర్లకు కూడా డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) పెంపు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి డీఏ, డీఆర్‌ల రేట్లను సవరిస్తున్న విషయం తెలిసిందే.
డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇవే..
==>> బేసిక్ శాలరీ- రూ.56,900
==>> కొత్త డీఏ (46 శాతం)-నెలకు రూ.26,174
==>> ప్రస్తుత డీఏ (42 శాతం)-నెలకు రూ.23,898
==>> డీఏ ఎంత పెరిగింది- నెలకు రూ.2276
==>> ఏటా పెరుగుదల ఎంత..?- రూ.27,312
==>> బేసిక్ శాలరీ -రూ.18,000
==>> కొత్త డీఏ (46 శాతం)-నెలకు రూ.8,280
==>> ప్రస్తుత డీఏ (42 శాతం)-నెలకు రూ.7,560
==>> డీఏ ఎంత పెరిగింది-నెలకు రూ.720
==>> ఏటా పెరుగుదల ఎంత..?- రూ.8,640.
ఇది కూడా చదవండి: NED VS SA: వరల్డ్ కప్ లో మరో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నెదర్లాండ్స్..
ఇది కూడా చదవండి: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న బన్నీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.