Gratuity and Pension Rule: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక.. కీలక నిబంధనల్లో మార్పు
New Rules For Gratuity and Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్, గ్రాట్యుటీ నిబంధనల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. ఇక నుంచి ఉద్యోగులు జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే..?
New Rules For Gratuity and Pension: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. విధుల్లో ఎవరైనా ఉద్యోగి అలసత్వం వహిస్తే రిటైర్‌మెంట్ తర్వాత పెన్షన్, గ్రాట్యుటీని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పని చేసే సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండవద్దని సూచించింది. ప్రస్తుతం ఈ ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించనుండగా.. భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేసే అవకాశం ఉంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 2021 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో రూల్ 8ని మార్చి.. కొత్త నిబంధనను యాడ్ చేసింది.
కొత్త రూల్ ప్రకారం ఉద్యోగి ఏదైనా తీవ్రమైన నేరం లేదా నిర్లక్ష్యానికి పాల్పడితే రిటైర్మెంట్ తరువాత ఆ ఉద్యోగి గ్రాట్యుటీ, పెన్షన్ నిలిపివేస్తామని హెచ్చరించింది. కొత్త నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత అధికారులందరికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పంపించింది. ఈ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఇలా చర్యలు తీసుకుంటారు..
==> ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం.. ఉద్యోగ సమయంలో వారిపై ఏదైనా శాఖ లేదా న్యాయపరమైన చర్యలు తీసుకుంటే.. సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
==> ఒక ఉద్యోగి పదవీ విరమణ తర్వాత తిరిగి నియమకం అయితే.. అవే నియమాలు ఆయనకు కూడా వర్తిస్తాయి.
==> ఒక ఉద్యోగి రిటైర్మెంట్ తరువాత పెన్షన్, గ్రాట్యుటీ చెల్లింపును తీసుకున్న తరువాత ఏదైనా కేసులో దోషిగా తేలితే.. ఆ ఉద్యోగి నుంచి పూర్తిగా లేదా పాక్షిక మొత్తంలో పెన్షన్ లేదా గ్రాట్యుటీని తిరిగి వెనక్కి తీసుకోవచ్చు.
==> డిపార్ట్‌మెంట్‌కు జరిగిన నష్టం ఆధారంగా ఇది అంచనా వేస్తారు
==> అధికార యంత్రాంగం కోరుకుంటే.. ఉద్యోగి పెన్షన్ లేదా గ్రాట్యుటీని శాశ్వతంగా లేదా కొంత కాలం పాటు నిలిపివేయవచ్చు.
నిబంధనల ప్రకారం.. ఏ అధికారి అయినా తుది ఆర్డర్ ఇచ్చే ముందు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సూచనలు తీసుకోవాలి. పెన్షన్ నిలిపివేసిన లేదా ఉపసంహరించిన ఏదైనా సందర్భంలో కనీస మొత్తం నెలకు రూ.9 వేల కంటే తక్కువగా ఉండకూదు. ఇది ఇప్పటికే రూల్ 44 ప్రకారం నిర్దేశించారు.
Also Read: Rath Yatra Accident: రథయాత్రలో తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో ఏడుగురు మృతి
Also Read: Singer Sai Chand: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ప్రముఖ సింగర్ కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి