7th Pay Commission latest news: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరిధిలోకి వచ్చే ఈ ఖాళీల సంఖ్య మొత్తం ఆరు కాగా సెంట్రల్ పే కమిషన్ ప్రకారం వేతనం కలిగిన ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 11 ఫిబ్రవరి 2021 గా ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్-బి, గెజిటెడ్ హోదా కలిగిన అధికారిగా నియమిస్తారు. UPSC notification ప్రకారం ఇది పర్మినెంట్ జాబ్ ఆఫర్. ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం యుపిఎస్సి అధికారిక వెబ్‌సైట్ - upsconline.gov.in లో లాగిన్ అవ్వొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

7th CPC Pay Scale:
UPSC jobs notification ప్రకారం, నియామక ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తరువాత, ఎంపికైన అభ్యర్థికి లెవల్ -7 పే స్కేల్ కింద వేతనం అందిస్తారు. ఎంపికైన అభ్యర్థుల జీతం నెలకు రూ .44,900 నుండి 1,42,400 రూపాయల వరకు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎంపికైన అభ్యర్థికి లభించే కనీస వేతనం రూ .44,900 కాగా, గరిష్టంగా అందుకునే జీతం నెలకు 1,42,400 రూపాయలు వరకు ఉంటుందన్న మాట. ఇదే కాకుండా, ఎంపికైన అభ్యర్థులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA), ట్రావెల్ అలవెన్స్ (TA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) వంటి ఇతర ఏడవ వేతన కమిషన్ ప్రోత్సాహకాలు ( 7th pay commission perks ) కూడా అందుకోనున్నారు.


Also read : Telangana Govt Jobs: తెలంగాణలో 39 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ, PRC Reportలో ఊహించని వివరాలు
Educational Qualification: ఉద్యోగానికి అవసరమైన అర్హతలు
1) ఎ) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఇనిస్టిట్యూట్ నుండి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (Oil technology) లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఆయిల్ టెక్నాలజీ) చేసి ఉండాలి. లేదా


బి) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా ఇనిస్టిట్యూట్ నుండి సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు Sugar technology లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉండాలి.


2) షుగర్ టెక్నాలజీలో లేదా పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్‌లో Edible oils ఫీల్డులో ఒక సంవత్సరం అనుభవం అవసరం.  


Also read : India Post Jobs 2021: తెలంగాణలో Gramin Dak Sevak Postsకు నోటిఫికేషన్, పూర్తి వివరాలు


Age limit: వయో పరిమితి
General Category కి చెందిన దరఖాస్తుదారుడికి దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. షెడ్యూల్ కులం (SC candidates) దరఖాస్తుదారుని వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు. ఇతర వెనుకబడిన కులాలకు చెందిన అభ్యర్థుల (OBC candidates)  వయస్సు 33 సంవత్సరాలు మించకూడదు.


UPSC notification లో పేర్కొన్న వివరాల ప్రకారం రెండేళ్ల ప్రొబేషనరి పీరియడ్ పూర్తి చేసుకున్న అనంతరం ఈ ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం... మీకూ తగిన విద్యార్హతలు ( Educational Qualifications ) ఉన్నాయా ? అయితే త్వరపడండి. 7th Pay Commission ప్రకారం వేతనం అందిస్తున్న ఈ ఉద్యోగానికి గడువు ముగిసేలోగా దరఖాస్తు చేసుకోండి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook