DA Hike For Govt Employees: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, డీఆర్ పెంపు
7Th Pay Commission Latest News Today: జీతభత్యాల పరంగా ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఎదురుచూసే అంశం ఏవైనా ఉన్నాయా అంటే అది వారి పే స్కేల్ రివిజన్ తో పాటు డియర్‌నెస్ అలవెన్స్ వంటి పేమెంట్స్ చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయా అనే ఎదురుచూస్తుంటారు. ఇది అన్ని రాష్ట్రాల ఉద్యోగులకు ఈ ఎదురుచూపులు వర్తిస్తాయి.
7Th Pay Commission Latest News Today: జీతభత్యాల పరంగా ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఎదురుచూసే అంశం ఏవైనా ఉన్నాయా అంటే అది వారి పే స్కేల్ రివిజన్ తో పాటు డియర్‌నెస్ అలవెన్స్ వంటి పేమెంట్స్ చెల్లింపులు ఎప్పుడు జరుగుతాయా అనే ఎదురుచూస్తుంటారు. ఇది అన్ని రాష్ట్రాల ఉద్యోగులకు ఈ ఎదురుచూపులు వర్తిస్తాయి. ఎందుకంటే మిగులు బడ్జెట్‌తో భారీ ఆదాయం కలిగిన ఏవో ఒకటి, రెండు రాష్ట్రాలు మినహాయిస్తే.. మిగతా ఏ రాష్ట్రంలోనైనా సంవత్సరం పొడుగునా , లేదా ఏళ్ల తరబడి వేతనాల పెంపు అంశమో లేదా డియర్‌నెస్ అలవెన్స్ పెంపు అంశమో ఏదో ఒకటి పెండింగ్‌లో ఉంటుండటం సహజమే. ఇదే విషయమై ఉద్యోగ సంఘాలు తమ హక్కుల సాధనకై ఉద్యమించిన సందర్భాలు కూడా అనేకం ఉంటుంటాయి.
తాజాగా ఒడిషా సర్కారు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒడిషా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డియర్‌నెస్ అలవెన్స్ పెంచుతున్నట్టు ప్రకటించిన ఒడిషా సర్కారు.. పెంపు జనవరి 1, 2023 నుంచే ఆ డియర్నెస్ అలవెన్స్ పెంపు వర్తిస్తుందని స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్ల డియర్‌నెస్ అలవెన్స్ , అలాగే డియర్‌నెస్ రిలీఫ్‌ను ఒడిషా ప్రభుత్వం 4% పెంచుతున్నట్టు ప్రకటించింది.
తాజాగా ఒడిషా సర్కారు జారీచేసిన నోటిఫికేషన్ ప్రకారం, డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచగా.. తాజా అలవెన్సుతో కలిపి ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ ప్రస్తుతం 38 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు జనవరి 1, 2023 నుండి వర్తిస్తుందని ఒడిషా సర్కారు ప్రకటించడం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత తీపి కబురును అందించినట్టయింది.
ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగులకే కాకుండా.. ఈ డిఏ పెంపు ఫలాలు పింఛనుదారులకు కూడా అందేలా డియర్‌నెస్ రిలీఫ్ 4 శాతం పెంచడం జరిగింది. జూన్ నెల వేతనంలో, పెన్షన్‌లో సవరించిన మొత్తం క్రెడిట్ అవనున్నట్టు తెలుస్తోంది. డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంపుతో దాదాపు 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నట్టు ఒడిషా సర్కారు తేల్చిచెప్పింది.