7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. మూడు రోజుల్లో క్లారిటీ
7th Pay Commission DA Hike News: డియర్‌నెస్ అలవెన్స్ పెంపుపై మరో మూడు రోజుల్లో క్లారిటీ రానుంది. మే నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా జూన్ 30న కేంద్ర కార్మిక శాఖ రిలీజ్ చేయనుంది. మరోసారి డీఏ 4 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది మొదటి డీఏ 4 శాతం పెరిగింది. మార్చిలో డీఏ పెంపు ప్రకటన రాగా.. జనవరి 1వ తేదీ నుంచి వర్తించింది. ఇక రెండో డీఏ పెంపు ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఉద్యోగులు, పెన్షనర్‌లకు డియర్‌నెస్ అలవెన్స్ ఈసారి సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏను పెంచుతున్న విషయం తెలిసిందే. జనవరి నుంచి జూన్ వరకు ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఆధారంగా జూలై డీఎ ప్రకటన రానుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఇప్పటికే రాగా.. మే నెలకు సంబంధించిన ఇండెక్స్ డేటా జూన్ 30న విడుదలకానుంది.
ప్రస్తుతం జూలై 1వ తేదీ నుంచే వర్తించే డీఏ పెంపు ఎంత ఉంటుందనే చర్చ జరుగుతోంది. మొదటి డీఏలో నాలుగు శాతం పెంచడంతో ప్రస్తుతం 42 శాతానికి చేరుకుంది. మే నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా వస్తే.. రెండో డీఏ పెంపుపై దాదాపు క్లారిటీ రానుంది. ఈసారి కూడా 4 శాత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో డీఏ 46 శాతానికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ నెలలో ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా 134.02 పాయింట్లకు పెరిగింది. దీని ఆధారంగా డీఏ 45.04 శాతానికి చేరుకుంది. మే, జూన్ నెలల్లో కూడా పెరుగుదల ఉంటే.. డీఏ 46 శాతానికి చేరుకునే ఛాన్స్ ఉంది.
ఉద్యోగి బేసిక్ శాలరీ రూ.18 వేలు అయితే.. 42 శాతం డీఏ లెక్కిస్తే రూ.7560 అందుతుది. ఇది 46 శాతానికి పెరిగితే.. 8280 రూపాయలకు చేరుతుంది. ఉద్యోగులకు డీఏ, రిటైర్డ్ ఉద్యోగులకు డీఆర్‌ను నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ప్రతిపాదికగా తీసుకుంటుంది. ప్రతి నెల చివరి పనిదినం నాడు.. కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) డేటా విడుదలవుతుంది. ఈ సూచిక 88 కేంద్రాల కోసం తయారు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook