7th Pay Commission Latest Update: చైత్ర నవరాత్రుల మొదటి రోజున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు వచ్చే అవకాశం కనిపిస్తోంది. బుధవారం కేంద్ర మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఉద్యోగులకు డీఏ పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంపును కేంద్రం ప్రకటించనుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. కేంద్ర మంత్రివర్గం దీనిని ఆమోదించినట్లయితే.. 1 జనవరి నుంచి డీఏ పెంపు అమలులోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెంపు ప్రకటన కోసం వేచి చూస్తున్న విషయం తెలిసిందే. హోలీకి ముందే ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని ప్రచారం జరిగినా.. ఆ దిశగా నిర్ణయం రాలేదు. నేడు జరిగే కేబినెట్‌ మీటింగ్‌లో అయినా ప్రకటన వస్తుందని నమ్మకంతో ఉన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్రం ప్రతి సంవత్సరం డియర్‌నెస్ అలవెన్స్‌ను రెండుసార్లు పెంచుతోంది. మొదట జనవరిలో, తరువాత జూలైలో పెంపు ఉంటుంది. గతేడాది ఉద్యోగుల డీఏను మొదట మార్చిలో తరువాత సెప్టెంబర్‌లో పెంచింది. చివరిసారి డీఏ 34 శాతం నుంచి 38 శాతానికి పెంచారు. ఈసారి కూడా మరో నాలుగు శాతం పెరిగి.. 42 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. 


4 శాతం డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది. ఉదాహరణకు.. ఒక ఉద్యోగి  బేసిక్ శాలరీ నెలకు రూ.25,500 అయితే.. ఆ ఉద్యోగి 38 శాతం చొప్పున రూ.9,690  డీఏగా పొందుతాడు. 4 శాతం డీఏ పెంపు తర్వాత డియర్‌నెస్ అలవెన్స్ 10,710 రూపాయలకు పెరుగుతుంది. అంటే ఉద్యోగి నెలవారీ జీతం రూ.10,710–రూ.9,690 = రూ.1,020 పెరుగుతుంది. 


అదే పద్ధతిలో.. ఒక రిటైర్డ్ ఉద్యోగి నెలకు రూ.35,400 బేన్షన్ పెన్షన్ పొందుతునట్లయితే.. 38 శాతం డియర్‌నెస్ రిలీఫ్‌తో అతను రూ.13,452 పొందుతాడు. 42 శాతం డీఆర్ పెంపు తర్వాత అతను ప్రతి నెలా రూ.14,868 అందుకుంటారు. అతని పెన్షన్ రూ.14,868-రూ.13,452=1,416 రూపాయలు పెరుగుతుంది. నేడు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తే మార్చి నెల జీతంలో ఉద్యోగుల ఖాతాలో భారీగా నగదు జమ అయ్యే అవకాశం ఉంది. 


త్వరలో 8వ వేతన సంఘం..?


ఓవైపు డీఏ పెంపుపై చర్చ జరుగుతుండగా.. మరోవైపు కొత్త పే కమిషన్‌ను తీసుకురావచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతమున్న 7వ వేతన సంఘాన్ని భర్తీ చేయవచ్చని కూడా నివేదికలు వెల్లడిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024లో 8వ వేతన సంఘాన్ని ప్రవేశపెట్టి.. రెండేళ్ల తర్వాత 2026లో అమలు చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


Also Read: MLC Kavitha ED Enquiry: ఊపిరిపీల్చుకున్న బీఆర్ఎస్ వర్గాలు.. ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ  


Also Read: MLC Kavitha: వరుసగా ఫోన్లను మార్చిన ఎమ్మెల్సీ కవిత.. రహాస్య వ్యవహారాల కోసమేనా..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి